నేటి మంచి మాట... శాంతంగా ఉండే మనస్సు స్వర్గంలాంటిది. కొంతమంది ఎంతో సంపాదిస్తారు. కానీ కొంచం కూడా ప్రశాంతత అనేది ఉండదు. కొందరు.. ఏమి లేకపోయినా శాంతంగా గుండెపై చెయ్యి వేసుకొని నిద్రపోతారు. అలా శాంతంగా జీవించే వారి జీవితమే అద్భుతం అని చెప్పచ్చు. 

 

శాంతంగా ఉండే మనసు ఎప్పటికి స్వర్గంలా ఉంటుంది. స్వర్గం అంటే మనం చనిపోయాక ఉండేది కాదు. బతికి ఉన్నప్పుడే ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నాం అనేది ముఖ్యం. ప్రశాంతంగా లేని జీవితం ఎప్పటికి కూడా స్వర్గం కాదు.. కోట్లు సంపాదించినా ప్రశాంతత లేకుంటే అది నరకం అనే చెప్పాలి. 

 

శాంతంగా ఉండే మనసు స్వర్గంలా.. మనం ఎంత సంపాదించినా అది ఐదు వేళ్ళు లోపలి వెళ్ళడానికే అనే విషయం గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అలా కాదు అని.. ఏదో సంపాదించాలి అని అనుకుంటే ఎప్పుడు కూడా ప్రశాంత జీవితాన్ని అనుభవించలేరు.. అందుకే ఉన్న దాంట్లోనే సర్దుకుపోయి జీవిస్తే అద్భుతంగా ఉంటుంది. శాంతంగా ఉండే మనస్సు స్వర్గంలా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: