ఆనందమైన శృంగారం ఎంత ముఖ్యమో.. ఆరోగ్యకరమైన శృంగారం కూడా అంతే ముఖ్యం. స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక కార్యం మూలంగా ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. ఇక సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పటికే బోలెడన్నీ పరిశోధనలు వచ్చాయి. సెక్స్‌ రక్తపోటు నియంత్రణలో ఉంటుందని ఒక పరిశోధనలో వెల్లడైతే.. సెక్స్‌ మహిళల్లో జ్ఞాపకశక్తిని పెంచుతుందని మరో పరిశోధనలో తేలింది. అందుకే సెక్స్ అనేది కేవలం భావప్రాప్తి కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

 

మ‌రి సెక్స్‌తో ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చా అంటే అవున‌ని స‌మాధానం ఇస్తున్నారు కొంద‌రు నిపుణులు. కరోనా సోకితే.. చావు ఖాయమనే భావన చాలా మందిలో నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో ఎవరైనా తుమ్మినా, దగ్గినా వారికి దూరంగా జరగడం లాంటివి చేస్తున్నారు. దీంతో కాపురానికి కూడా చాలా మంది దూరంగా ఉంటున్నారు. కానీ, సెక్స్ వ‌ల్ల క‌రోనా రాకుండా ఉండొచ్చంటున్నారు కొంద‌రు. ఇప్పటి వరకు సెక్స్‌ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని మనకు తెలిసిందే. 

 

నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం అంటున్నారు. తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల జలుబు అనేది దరి చేరకుండా ఉంటుంది. అలాగే వారానికి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొంటే యువతీ యువకుల లాలాజలంలో పోరాడే యాంటీ బాడీలు పెద్ద మొత్తంలో తయారౌతాయట. అవి ఎక్కువ మొత్తంలొ ఉంటే.. మన ఇమ్యునిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉన్నట్టే లెక్క. దీంతో కరోనా ద‌రిచేరే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ట‌. ఏదేమైనా కరోనా విషయంలో వ్యక్తిగత శుభ్రత పాటించడం ఉత్తమం అనేది మ‌రికొంద‌రి నిపుణుల వాదన. 

మరింత సమాచారం తెలుసుకోండి: