తెలంగాణలో రేపటినుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 5,34,903 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. సీఎం కేసీఆర్ పరీక్షలకు విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు గుంపులు గుంపులుగా రావొద్దని... ప్రొటక్షన్ మాస్క్ ధరిస్తే మరీ మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
 
విద్యార్థులు పరీక్షలలో కొన్ని టిప్స్ పాటిస్తే సులభంగా విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. పరీక్షలు రాసే సమయంలో టెన్షన్ పడకుండా ఎంజాయ్ చేస్తూ రాయాలి. పరీక్షకు వెళ్లే కొన్ని గంటల ముందు కొత్తవి చదవకపోవడమే మంచిది. పరీక్షకు ముందురోజు రాత్రంతా మేలుకుని బాగా చదివితే మంచిగా రాస్తామనే భావనను విద్యార్థులు దూరం చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం 6 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. 
 
ఉదయం 5 గంటలకు చదివితే బాగా గుర్తుంటుంది. పరీక్షకు వెళ్లడానికి ముందు అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మసాలాలు, నూనెలతో తయారైన వంటకాలు, ఫాస్ట్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి. ఫలితం గురించి ఆలోచించకుండా సానుకూల దృక్పధంతో పరీక్ష రాస్తే విజయం సొంతమవుతుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకుంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: