కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్ర‌జ‌ల‌ను భయపెడుతుంది. ఈ వైర‌స్‌ దెబ్బ‌కు ప్రపంచవ్యాప్తంగా మేజర్ ఈవెంట్లలో చాలా వరకు వాయిదాపడ్డాయి. మరికొన్ని పోటీలు రద్దయ్యాయి. ఇప్పటికే జన సమూహాలు ఎక్కువగా ఉండే విద్యా సంస్థలు, థియేటర్స్, మాల్స్, క్లబ్స్, పబ్స్ వంటి వాటిని మూసి వేసింది ప్రభుత్వం.  సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఇతర కంపెనీలూ తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యిస్తున్నాయి. గతంలో వర్క్‌ ఫ్రమ్‌ సంస్కృతి ఐటీ కంపెనీలలో ఉన్నా ఇప్పుడు అది మరింత విస్తృతమైంది. 

 

కేంద్ర ప్రభుత్వ సూచనలను ఆచరిస్తూ వీలైనంతగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇళ్ల నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగుల భద్రతకూ పెద్దపీట వేస్తున్నాయి. అయితే ఆఫీస్‌లో చేసిన పనికీ, ఇంట్లో చేసిన పనికీ తేడా కచ్చితంగా ఉంటుంది. ఎంత పోల్చుకున్నా... ఆఫీస్‌లోనే పని ఎక్కువ జరుగుతుంది. ఇందుకు కారణం ఆఫీస్ ఎన్విరాన్‌మెంటే. వాస్త‌వాంగా చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వినడానికి ఆనందంగా ఉన్నా చెయ్యడానికి కష్టంగా ఉండే అంశం.

 

అయితే దీన్ని కూడా కొన్ని టిప్స్‌తో సులువుగా మార్చుకోవ‌చ్చు. వర్క్ ఎట్ హోమ్ కదా అని డ్రెస్ కోడ్ లేకుండా ఉండొద్దు. మంచి డ్రెస్ వేసుకున్నప్పుడే పని బాగా చెయ్యగలరని పరిశోధనల్లో కూడా తేలింది. అలాగే ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటే ఆ డెస్కు, ఆ సిస్టమ్ స్పేస్ అన్నీ పద్ధతిగా ఉంటాయి. ఇంట్లో అలాంటి ఏర్పాటు లేకపోతే ఇబ్బందే. వీలైనంత త్వరగా అలాంటి సెట్టింగ్ చేసుకుంటే మెడ నొప్పి, భుజం నొప్పి, బద్ధకం, అలసట వంటివి రాకుండా ఉంటాయి. ఎక్కువ సేపు కూడా వ‌ర్క్ చేయ‌గ‌లుగుతారు.

 

ఇక పని సమయంలో లేదా మీ షిష్ట్ సమయంలో మీరు ఒంటరిగా పని చేసుకోవ‌డం మంచిది. ఇంట్లో వాళ్లతో మాటల్లో పడితే పనిపై శ్ర‌ద్ధ పెట్ట‌లేము. పని చేసేటప్పుడు రెగ్యులర్‌గా వాటర్ తాగండి. మ‌రియు బాగా అలసటగా, బోర్ కొట్టేస్తున్నట్లైతే ఓ మూడు నిమిషాలు మ్యూజిక్ వినడమో కామెడీ సీన్ చూడటమో చెయ్యండి. దీంతో మీ మూడ్ రిఫ్రెష్ అయ్యి వ‌ర్క్ మోడ్‌లోకి వెల్ల‌వ‌చ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో వ‌ర్క్‌పై ఆశ్ర‌ద్ధ చూప‌కూడ‌దు. ఎప్ప‌టి వ‌ర్క్ అప్పుడు చేసుకుంటేనే మేలు.
  

మరింత సమాచారం తెలుసుకోండి: