ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లదనం కోసం పరుగులు పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ నీడ ఉంటుందోనంటూ ప్రయాణాలు చేసేవారు చెట్లని వెదుక్కుంటూ పరుగు పరుగున చెట్టు కిందకి చేరుకుంటారు. మరి ఇళ్ళలో , ఆఫీసుల్లో ఏసీలు ఉన్న వారైతే ఉదయం మొదలు, పడుకునే వరకూ ఏసీ చల్లగాలిలో గడిపేస్తూ ఉంటారు. అయితే నిరంతరం ఏసీలలో ఉండే వారు కొన్ని రకాల జబ్బుల బారిన పడుతూ సైడ్ ఎఫెక్ట్ లతో బాధలు పదుతున్నట్లుగా పరిశోధనలలో తేలిందని అంటున్నారు నిపుణులు..అవేమిటో ఒక సారి పరిశీలిద్దాం.

IHG

ఈ రోజుల్లో కాలానికి సంభంధం లేకుండా  ఏసీ గదుల్లోనే ఎక్కువ మంది గడుపుతున్నారు. అలాంటి వారిలో  కళ్ల మంటలు ,కళ్ళకింద దురదలు వంటివి ఎక్కువవుతున్నాయని నిపుణులు గుర్తించారు. వీటికి  ప్రధాన కారణం ఏసీలు ఎక్కువ సమయం  గడపడమే.  డ్రై ఐస్ సమస్య ఉన్నవారు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని అలాంటివారు ఏసీలకి  ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సూచిస్తున్నారు

IHG

ఏసీ ఆన్ చేయగానే  చల్లని గాలి బయటకు వెళ్ళకుండా తలుపులు మూసి వేస్తాం. దాని ఫలితంగా మన నుంచి రిలీజ్ అయ్యే కార్బన్ డై ఆక్సయిడ్  ను మనమే పీల్చుకోవడం జరుగుతుంది. దీనివలన తలనొప్పి వస్తుంది అయినా  పట్టించుకోకుండా తరచూ ఏసీలో ఉన్నట్లయితే ఆ తలనొప్పి మైగ్రేన్ తలనొప్పి గా మారుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కసారి మైగ్రేన్ వస్తే అది తగ్గడం చాలా కష్టతరం అవుతుందని అంటున్నారు

IHG

ఏసీ వల్ల బ్లడ్ లో ఆక్సిజన్ తక్కువై శరీరం తొందరగా అలిసిపోతుందని, బీపీ రావడానికి ఏసీ ప్రధాన కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీ చల్లదనాన్ని ఎంత శరీరం ఆస్వాదిస్తే అంతగా మనం డీ హైడ్రేషన్ కి  చేరుకుంటామని దాంతో మనం సహజంగా కంటే కూడా అధికశాతం నీరు తాగాల్సి వస్తుందని సూచిస్తున్నారు

IHG

ఏసీలు లో ఎక్కువ  సమయం గడిపే వారు నీరు ఎక్కువగా తీసుకోకపోతే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని, ఏసీ వల్ల చర్మం పొడిబారి పోతుంది అని ముక్కు గొంతు కళ్ళు దెబ్బతింటాయని వీటికి కారణం ఏసీ వల్ల వచ్చే అలర్జీలు అంటున్నారు.

IHG

అందుకే వీలైనంత సమయం ఏసీ గదుల్లో గడపక పోవడమే మంచిదని, చల్లని గాలికోసం సహజసిద్దమైన పద్దతులని పాటించడం ఎంతో ఉత్తమమని, చల్లని చెట్లు నీడలు ఎంతో స్వచ్చమైన గాలిని అందిస్తాయని, అలాగే దుప్పట్లు తడి చేసి గాలి వచ్చే ప్రాంతంలో పెట్టడం వలన చల్లని గాలి అందుతుందని తద్వారా ఎండ నుంచీ రక్షించుకోవచ్చని. వీలైనంత సమయం ఏసీలకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: