మీరు చాలా మంచి వాళ్లు.. ఆ విషయం మాకూ తెలుసు. కానీ మీ భవిష్యత్తు మీ ఒక్కరిపైనే ఆధారపడి ఉండదన్న సత్యం మీరు గమనించాలి. మనతో పాటు మన కుటుంబం ఉంటుంది. ఎందుకంటే అది మనకు జన్మతహా వచ్చింది. ఈ బంధాలు జన్మతో ఏర్పడతాయి. వియ్యాలతో ఒక్కటయ్యేవి చుట్టరికాలు.

 

 

కానీ కొన్ని బంధాలు మనం ఎంచుకోవచ్చు.. అలాంటివే స్నేహ బంధాలు. స్నేహానుబంధాలు. మన స్నేహితులు మంచివారైతే పరవాలేదు. కానీ దుజ్జనులతో స్నేహం చేస్తే.. మనం కూడా కలుషితం అవుతాం. ఇందుకు చరిత్రలో ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి. కావాలంటే పరిశీలించండి.

 

 

భారతంలో కర్ణుడు తెలుసుకదా. ఎంత మంచివాడు. దాన, వీర, శూర కర్ణుడుగా పేరుగాంచిన వాడు. స్వార్థమన్నదే లేకుండా ఆపదలో ఉన్నవారికోసం ఏదైనా దానం చేసే మంచి మనసున్నవాడు. కానీ ఆ కర్ణుడు కూడా దుర్యోధనుడు వంటి దుర్మార్గుడైన మిత్రుడి కారణంగా చరిత్రహీనుడయ్యాడు.

 

 

అందుకే మీ స్నేహితులపై ఓ కన్నేసి ఉంచండి. ఏమాత్రం తేడా వచ్చినా పక్కకు పెట్టేయండి. లేకపోతే.. మీరూ చెడిపోతారు. విషాదం ఏంటంటే.. పూర్తిగా చెడిపోయే వరకూ మీకూ ఆ విషయం తెలియదు. తస్మాత్ జాగ్రత్త.

 

మరింత సమాచారం తెలుసుకోండి: