స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అంటాడో సినీ కవి.. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి.. ఇలాంటి బంధాలన్నీ రక్తసంబంధాలు.. వీటిలో ఎంచుకునేందుకు మనకు ఛాయిస్ ఉండదు. కానీ మన స్నేహితుడుని మనం ఎంచుకోవచ్చు. మన అభిరుచి ప్రకారం.. నచ్చిన వాళ్లతో స్నేహం చేయొచ్చు.

 

 

నచ్చని స్నేహాలను వదిలించుకోవచ్చు. ఓ మంచి స్నేహితుడు ఉంటే.. జీవితం ఎంతో ఆనంద ప్రాయం అవుతుంది. అయితే ఆ స్నేహం బీటలు వారకుండా చూసుకోవాల్సిన బాధ్యతా మనపైనే ఉంటుంది. స్వార్థం కోసమో.. ఏదైనా లాభాపేక్ష కోసమో కలుపుకునే స్నేహాలు నిలబడవు.

 

 

అలాగే స్నేహంలో నిజాయితీ అవసరం. ఒక్కొక్కసారి మనం చేసే తప్పులు ఇబ్బందులు కలిగిస్తే ఆ తప్పులకు మరొకరిని బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తాం. అలా చేసినప్పుడు సంబంధాలు దెబ్బతిని బీటలు వారతాయి. ఆత్మపరిశీలన వల్ల అరమరికలు తొలగిపోయి స్నేహ బంధం వాడిపోకుండా ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: