సాధార‌ణంగా తల్లి అనిపించుకున్నప్పుడే ఆడజన్మకు సార్థకత. అమ్మతనం కోసం పెళ్లైన‌ ప్రతి స్త్రీ తపిస్తుంది, తపస్సు చేస్తుంది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే స్త్రీకి గ‌ర్భం దాల్చ‌డం అన్నింటికంటే ఎక్కువ‌గా ఆనందాన్నిచ్చే విష‌యం. ఇక వికారం, మార్నింగ్ సిక్నెస్, వాంతులు, అజీర్తి, తలనొప్పి, వంటి నొప్పులు, మరేదైనా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు వంటి సమస్యలు ఎన్ని ఎదురైనా, కడుపులో బిడ్డ ఉందన్న ఆనందం ముందు అవన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి.

అయితే ఆరోగ్యమైన శిశువు కొరకు ఖ‌చ్చితంగా ఆహార నియ‌మాలు పాటించాలి. ఎందుకంటే.. తల్లి తీసుకునే ఆహారపుటలవాట్లు మొత్తం జీవన శైలి ప్రభావం బిడ్డపై ఉంటుంది. మ‌రియు అందుకే కడుపుతో ఉన్నప్పుడు తల్లి నీతికథలు చదవడం,సంగీతం వినడం లాంటివి చేయాలి. ఇక తల్లి కడుపులో ఉన్నప్పుడే శిశువు కొన్ని విషయాలు నేర్చుకుంటాడట. అవును! మీరు విన్న‌ది నిజ‌మే. మ‌రి అవేంటో చూడండి.

వినికిడి, శబ్దాలను గ్రహించడం, రుచిని తెలుసుకోవడం..ఈ మూడు విషయాలు తల్లి కడుపులో ఉన్నప్పుడే బిడ్డ‌ తెలుసుకుంటాడట. చాలావరకు పిల్లలు తీసుకునే ఆహారం వాళ్ల అమ్మ కడుపుతో ఉన్నప్పడు తీసుకునే ఆహారాన్ని ఇష్టంగా తినడం… వాళ్ల అమ్మ కడుపుతో  ఇష్టపడని ఆహారాన్ని పిల్లలు కూడా ఇష్టపడకపోవడం జ‌రుగుతుంటుంది. అలాగే నవజాత శిశువులు తల్లి కడుపులో ఉన్నప్పుడే మాటలను గుర్తించడం నేర్చుకుంటార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: