మానవుడు సంఘజీవి అన్నది ఎంత వాస్తవమో.. మానవుడు స్వార్థ జీవి అన్నదీ అంతే నిజం. అవును.. మనిషి ముందు తన సంగతి తాను చూసుకున్నాకే పక్కవాడి గురించి ఆలోచిస్తాడు. అది తప్పుకూడా కాదు. అయితే కొందరు మహానుభావులు మాత్రం ఈ లోకంలో ప్రతిదీ తనకు అనుకూలంగానే జరగాలని ఫీలవుతుంటారు.

 

తమకు ‌వ్యతిరేకంగా ఏది ఉన్నా సహించలేరు. కాస్తయినా సహనం చూపించలేరు. ఇలాంటి వారి వల్లే అందరికీ ఇబ్బందులు. దీని వల్ల వాళ్లు బాధపడతారు..ఇతరులనూ బాధపెడతారు. సూర్య భగవానుడి తొలి కిరణ స్పర్శతో ఆహ్వానం పలుకుతూ కమలం వికసిస్తుంది. అలాగే వ్యక్తుల మధ్య మంచి సంబంధాలు ఉంటే వారి స్నేహం మరింత దీప్తిమంతమవుతుంది.

 

 

లోకంలో అందరూ అన్నీ ఇష్టపడరు. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. కొందరికి ఏమాత్రం సహనం ఉండదు. దీని కారణంగా అందరినీ దూరం చేసుకుంటారు. కొంత ఇబ్బంది ఉన్నా కొందరిలో సుగుణాలను దూరం చేసుకోలేక వారితో స్నేహం చేస్తారు తెలివైనవారు.

 

 

సామాజిక జీవన స్రవంతిలో, స్నేహాల్లో అపోహలు తారసిల్లుతుంటాయి. ఏ తేడా వచ్చినా బాంధవ్యాలు తెగిపోతాయి. బలమైన సంబంధాల అల్లికలు చిక్కుబడకుండా కాపాడుకోవాలంటారు నిపుణులు. ఇందుకు కావాల్సింది కాస్త సహనం. సర్దుకుపోయే తత్వం కాదంటారా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: