ఈ ప్ర‌పంచంలో శృంగారం అనేది ప్ర‌తి ఒక్క‌రికి ఎంత ఇంపార్టెంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. శృంగారం మ‌నిషి జీవ‌న గ‌మ‌నానికి ఎంతో ముఖ్యం. అన్నింటికి మించి మ‌రో ప్రాణి భూమిమీద‌కు రావ‌డంలో ఇదే కీల‌కం. ఇక మ‌రి కొంద‌రికి మంచి అనుభ‌వంగాను.. ఎంజాయ్‌గాను.. మ‌నిషి జీవితంలో ఒత్తిళ్లు త‌గ్గించ‌డంలోనూ ఇలా అనేక ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇదిలా ఉంటే చాలా మంది నైట్ డ్యూటీలు చేస్తుంటారు. నైట్ డ్యూటీలు చేసే వారికి ఇది హెచ్చరికే. 

 

రాత్రి వేళ విధులు నిర్వర్తించేవారితోపాటు.. మ‌రి కొంద‌రు వారానికి ఒక షిఫ్టులో ప‌ని చేస్తూ ఉంటారు. అంటే ఉద‌యం షిఫ్టులు.. సాయంత్రం షిఫ్టులు.. మ‌ధ్యాహ్నం షిఫ్టులు.. రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వ‌హిస్తూ ఉంటారు. ఇక దీనికి తోడు ఉద్యోగంలో ఉన్న ఒత్తిళ్లు. అల‌స‌ట గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక మ‌నిషి జీవితం పెద్ద యాంత్రికంగా మారిపోయింది. ముఖ్యంగా పెళ్లికాని యువ‌తకు త‌క్కువ వ‌య‌స్సులోనే వీర్య క‌ణాల కౌంట్ ప‌డిపోయే ప్ర‌మాదం ఉంద‌ట‌.

 

ఇది పిల్ల‌లు పుట్టుక‌పై ప్ర‌భావం చూప‌డంతో పాటు గుండె సమస్యలు, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని టారో వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. యుక్త వ‌య‌స్సులో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లు.. ఇత‌ర ఉద్యోగాలు చేసే వారు ఒక‌టే షిఫ్టుల్లో కాకుండా ర‌క‌ర‌కాల షిఫ్టుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. దీని వ‌ల్ల మ‌నిషి జీవ గ‌డియారం దెబ్బ తిన‌డంతో పాటు అనేక ర‌కాల స‌మ‌స్య‌లు చుట్టుముట్ట‌డం.. చివ‌ర‌కు పిల్ల‌ల పుట్టుక‌పై కూడా ఇది తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: