కరోనా వైరస్ ధాటికి ప్రజలు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ఒకరా ఇద్దరా ఏకంగా సుమారు 15వేల పైచీలుకు మృతి చెందగా లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే పలు దేశాలు ప్రజలకి జాగ్రత్తలు చెప్తున్నాయి. కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...కరోనా సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి. ఎన్ని రోజుల్లోగా వ్యాధి బయటపడుతుంది అనే వివరాలు ప్రజలకి తెలియచేస్తున్నారు.

IHG

ఈ వైరస్ బారిన పడకుండా ఉండటానికి  ప్రజలు అందరూ ఇళ్లలోనే  ఉండాలంటూ సూచిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కలిగిన వారిని క్వారంటైన్ కి తరలిస్తున్నారు. గుంపులు గుంపులుగా ఉన్నా, ఎవరైనా దగ్గుతున్నా , జ్వరం వచ్చినా సరే కరోనా వచ్చిందేమోననే కంగారు అందరిలో కలుగుతోంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా కేవలం జలుబు, దగ్గు, జ్వరం ద్వారా మాత్రమే కాకుండా మరొక లక్షణం ఉన్నా కరోనా వైరస్ సోకిందని అనుమానించవచ్చని అంటున్నారు....

IHG

ఇంతకీ ఆ మరో లక్షణం ఏమిటంటే.. కరోనా సోకినా వ్యక్తికి జలుబు, దగ్గు, జ్వరం ఎలాగైతే వస్తాయో అలాగే వాసన చూసే స్వభవాన్ని కోల్పోతారట. ఈ విషయాన్ని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు, బ్రిటీష్ డాక్టర్లు అంటున్నారు. కరోనా బారిన పడిన బాధితుల్లో కొంతమందిలో రుచిని చూసే స్వభావం కోల్పోయినట్టు గుర్తించినట్టుగా  శాస్త్రవేత్తలు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: