క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19 ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. చైనాలో వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్  ప్రపంచమంతా విస్తరిస్తూ ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజురోజుకి ఈ వైరస్ బారిన పడి మృత్యుఒడికి చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలకు ఈ మహమ్మారి విస్తరించింది. కరోనా వైరస్ భయంతో ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజలు ఇంటిపట్టునే ఉండిపోవడంతో నగరాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. 

 

కొన్ని దేశాలలో ప్రజా కదలిక పై ప్రభుత్వాలు నిషేధం విధిస్తే మరి కొన్ని చోట్ల ప్రజలు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. దీంతో అంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. అయితే సాధార‌ణంగా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంటుంది. అలాంటి వారు ఆన్‌లైన్‌లో ఫ్రీగా కొన్ని కోర్సులు చేయోచ్చు. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి.

 

ఫోటోగ్రఫీ.. ఫోటోగ్రఫీ మీకు ఇష్ట‌మైతే.. అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఆన్‌లైన్ ఫోటోగ్రఫీ కోర్సుల్ని అందిస్తున్నారు. 1,100 పైగా కోర్సులున్నాయి. ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసి నేర్చుకోవచ్చు. 

 

స్మార్ట్ సిటీస్‌.. స్మార్ట్ సిటీలు, వాటితో ఉండే లాభాల గురించి ఓపెన్ యూనివర్సిటీలో రెండు వారాల కోర్స్ ఉంది. స్మార్ట్ సిటీకి సంబంధించిన పరిజ్ఞానాన్ని పొందేందుకు ఈ కోర్స్ ఉపయోగపడుతుంది.

 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. స్మార్ట్‌ఫోన్ల నుంచి అత్యాధునిక వైద్య పరికరాల వరకు అంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే హవా. ఫిన్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అందిస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: