శృంగారం విషయంలో అబ్బాయిలు.. అమ్మాయిల కోరికల విషయానికి వస్తే ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. సహజంగా ఎక్కువ మంది సెక్సాలజిస్టులు చెప్పే దానిని బట్టి అబ్బాయిలకు పైకి కనిపించే కోరికలు ఉంటే.. అమ్మాయిలకు కనిపించని అంతర్గతమైన కోరికలు ఎక్కువుగా ఉంటాయట. ఇదే అభిప్రాయం కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. అయితే ఈ శృంగారం విషయంలో అబ్బాయిలు తమను తాము ఫ్రూవ్ చేసుకోవాలన్న కోరికతో ఉంటారట. అయితే ఇవన్నీ పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లయ్యాక మాత్రం వారిలో బిడీయం ఎక్కువుగా ఉంటుందని.. ఈ విషయంలో బాగా భయపడిపోతుంటారన్న అభిప్రాయం ఉంది.
పెళ్లి విషయంలో కేవలం ఆడపిల్లలు మాత్రమే భయడిపడి పోతారనుకవోడం పొరపాటు అట.. ఈ విషయంలో ఆడపిల్లలు ఎంత భయపడతారో ? అటు ఆమెతో పాటు పెళ్లి పీఠలు ఎక్కే మగవాళ్లు కూడా భయపడిపోతారట. తొలి శృంగారానికి ముందు అబ్బాయిలకు వచ్చే డౌట్ ముందుగా తమను తాము ఫ్రూవ్ చేసుకుంటామా ? తమలో అంత సామర్థ్యం ఉందా ? అన్న సందేహం ఉంటుందట. తొలి కలయిక సరిగా జరగకపోతే భార్య దృష్టిలో చులకన అవుతామన్న సందేహాలు వారిలో ఎక్కువుగా ఉంటాయట. ఇలాంటి అర్థం పర్థం లేని ఆందోళనలతోనే అంగం స్తంభించి అనేక ఇబ్బందులు ఎదురవుతాయట.
ఒక వేళ అంగస్తంభన లాంటి సమస్యలు ఉన్నా కొన్ని చికిత్సలు ఉన్నాయి. దీనిపై లేనిపోని ఆందోళనలు అవసరం లేదు. మరి కొందరు పెళ్లికి ముందు సెక్స్ అనుభవం ఉండాలని భావిస్తారు. ఇది పిచ్చి భ్రమ మాత్రమే. ఏదేమైనా ఎన్ని అపోహలు ఉన్నా వాటిపై అనవసరంగా ఆందోళన చెందడం కూడా వాటిని నివృత్తి చేసుకుంటే హాయిగా శృంగార జీవితం ఎంజాయ్ చేయవచ్చు.