క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19) ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసింది. ఈ క్ర‌మంలోనే క‌రోనా పాజిటివ్ కేసుల‌తోపాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా విప‌రీతంగా పెరుగిపోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ దేశాల్లో మొత్తం 21,116 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌గా.. 4,65,274 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా తేలిన‌ట్టు స‌మాచారం. భార‌త్‌లోనూ క‌రోనా వైర‌స్ రోజురోజుకు వేగాన్ని పుంజుకుంటుంది. ఇలా వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్‌ను మ‌ట్టుపెట్ట‌డానికి.. దేశమంతటా లాక్‌డౌన్‌ అయింది. కొన్ని ప్రాంతాల్లో, నిర్ణీత సమయాల్లో కర్ఫ్యూ కూడా అమలులో ఉంది. 

 

అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా, అందరం ఇళ్ళకే పరిమితమైపోయిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో క‌రోనా వైర‌స్‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. అందులో సగానికి పైగా అబ‌ద్ధాలే ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌జ‌లు అయోమ‌యంలో ప‌డుతున్నారు. ఏది న‌మ్మాలో.. ఏది న‌మ్మ‌కూడ‌దో అర్థంకాని ప‌రిస్థితి ఏర్ప‌డించింది. ఈ క్ర‌మంలోనే పావుగంట‌కోసారి నీళ్లు తాగితే క‌రోనా వైరస్ త‌గ్గిపోతుంది.. అన్న వార్త సామాజి మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

 

పావుగంట‌కోసారి నీళ్లు తాగితే   వైరస్‌ గొంతులో నుంచి కడుపులోకి పోతుందని,  తర్వాత కడుపులో యాసిడ్‌ల వల్ల అది చనిపోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కేవ‌లం అపోహ అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఊపిరితిత్తులకు సోకే వైరస్‌ ఇలా చనిపోతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు  లేవని నిపుణులు చెబుతున్నారు. . అయితే ఎక్కువగా నీళ్లు తాగుతూ  డీహైడ్రేషన్‌ రాకుండా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిదే కానీ, క‌రోనా వైర‌స్ త‌గ్గిపోతుంద‌ని ఎలా ఆధారాలు లేదు. కాబ‌ట్టి సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన ఇలాంటి ఫేక్ న్యూస్‌ల‌ను గుడ్డిగా న‌మ్మ‌కండి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: