చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనావైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసింది. చైనా తర్వాత అమెరికా, ఇటలీలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇక‌ ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి దాదాపు 21 వేల మంది చ‌నిపోగా.. ల‌క్ష‌ల్లో ఈ వైర‌స్‌ బాధితులు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా వ్యాప్తి చేంద‌కుండా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. కరోనా నియంత్రణలో భాగంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు ప్రధాని నరేంద్ర మోడీ. దీంతో మరో 21 రోజుల పాటు అస్త్యవసర సేవలు మినహా ఏమి పనిచేయవు... అంటే అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి.

అయితే క‌రోనా లాక్‌డౌన్‌లో ప్ర‌జ‌లంద‌రూ పాటించాల్సిన రూల్స్ ఏంటి..? అన్న‌ది చాలా మందికి అవ‌గాహ‌న ఉండ‌క‌పోవ‌చ్చు. ఆ విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు సూచనలు పాటించాలని చెబుతున్నారు. అందరూ తమ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, అందుకోసం విటమిన్ సి, సిట్రస్ ఎక్కువగా ఉండే పళ్లు తీసుకోవాలి. అలాగే ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ వంటి చల్లటి వస్తువులు ఏమీ తీసుకోవ‌ద్ద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

అదేవిధంగా, మీ ముఖాన్ని చేతులతో తాకవద్దు, ముఖ్యంగా కళ్లు, ముక్కు, నోటి భాగాలకు తాకరాదని, దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు మీ ముఖానికి మో చేతులు అడ్డం పెట్టుకోవాలని సూచిస్తున్నారు. మ‌రియు వేడి నీళ్లు ఎక్కువ తాగడం, వేడి నీళ్లు గొంతులో పోసుకుని పుక్కిలించడం, వేడి నీళ్లలో పసువు కలుపుకుని తాగడం, వేడి వేడి టీ, కాఫీలు మోతాదులో తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: