ప్రతిరోజు పని ఒత్తిడి వల్ల, ఇతర కారణాల వల్ల మనం అలసిపోతూ, నీరసించిపోతూ ఉంటాం. చాలా మంది కాఫీలు, టీలు తాగితే తాత్కాలికంగా అలసట తగ్గినా కొంత సమయానికి మరలా అలసిపోతారు. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా పండ్ల రసాలను తీసుకుంటే అలసట తగ్గడంతో పాటు శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పండ్ల రసాలు బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడతాయి. 


 
పండ్ల రసాలు రోజూ తాగితే వెంట్రుకలు బలపడటంతో పాటు చర్మం మెరుస్తుంది. పండ్ల రసాలలో శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. పండ్ల రసాలు ఉదయం సమయంలో తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ పండ్ల రసాలు తీసుకుంటే కీళ్ల నొప్పులు, క్యాన్సర్, కిడ్నీ.. కాలేయ సంబంధిత వ్యాధుల భారీన పడబోమని వైద్యులు చెబుతున్నారు. 


 
ఆపిల్ జ్యూస్ తీసుకుంటే కొలెస్ట్రాల్, చర్మసమస్యలు తగ్గడంతో పాటు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ద్రాక్ష రసం తాగితే హెమరాయిడ్స్, కీళ్లు, గుండె సంబంధిత వ్యాధులు, దూరమవుతాయి. కివి ఫ్రూట్ జ్యూస్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు జీర్ణ శక్తిని పెంచుతుంది. బత్తాయి రసం చర్మం ముడతలు పడకుండా సహాయపడుతుంది. నిమ్మరసం శరీరానికి దివ్యౌషధంలా పని చేస్తుంది. ఇవే కాకుండా ఇతర పండ్ల రసాలు తాగినా శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు చేకూరుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: