సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రూ.. ఏ ఒక సంద‌ర్భంలో అబద్ధం చెప్పే ఉంటారు. అయితే వాస్త‌వానికి అబ‌ద్ధాలు అమ్మాయిల క‌న్నా అబ్బాయిలే ఎక్కువ చెబుతార‌ట‌. ఈ అలవాటు దాదాపు అందరికీ చిన్నవయసులోనే అలవడి ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు  కొంతమంది చాలా చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. అబద్ధాలు చెపితే సాధారణంగా మీరు పిల్లలను కొడతారు, క్రమశిక్షణ చేస్తారు లేదా హాయిగా నవ్వేసి వదిలేస్తారు. 

 

కాని మూడు చర్యలు సరైనవి కావు. మరి సరైన దేమిటి? అసలు పిల్లలు అబద్ధాలు ఎందుకు చెపుతారనేది మీరు తెలుసుకోకుండా మీరు చేసేది సరైనది కాదు. అలాగే కొందరు పిల్లలు అబద్ధాలు చెబితే.. అసలు అది అబద్ధమని కూడా తెలీదు. అంత బాగా మేనేజ్ చేస్తుంటారు. అలా ఎదుటివారిని ఇట్టే నమ్మించేలా అబద్ధాలు చెప్పగలిగితే వారిలో అంత నేర్పరితనం పెరుగుతుందట. ముఖ్యంగా చిన్న పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయని ప‌రిశోధ‌న‌లో తేలింది.

 

అయితే తెలివితేట‌లు పెరుగుతాయ‌ని పిల్ల‌ల‌ను అంతటితో వదిలేయకండి. ఎందుకంటే అలా వ‌దిలేయ‌డం వ‌ల్ల పిల్ల‌లు అబ‌ద్ధాలు ఆడ‌డ‌మే అల‌వాటుగా మార్చుకుంటారు. కాబ‌ట్టి చిన్నపాటి శోధన చేయాలి. ఇది వారిపట్ల మీరు కఠినంగా వున్నారని శిక్షిస్తారని వారికి తెలుస్తుంది. మ‌రియు సరైన కారణాలు లేకుండా మీ బిడ్డ ప‌దే ప‌దే అబద్ధ‌మాడేస్తూంటే.. వాళ్ల‌కు చెప్పే రీతిలో కాస్త భ‌యం చెప్ప‌డం లాంటివి చేయాలి.
  
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: