సాధార‌ణంగా మానవ జాతి ఆరంభం అయిన నాటి నుండి ఒక తరం నుండి తదుపరి తరానికి జీన్స్ వ‌స్తూనే ఉంటుంది. ముఖ్యంగా కొందరి పిల్లల్లో ప్రత్యేకంగా తండ్రి పోలికో, తల్లి పోలికో బలంగా ఉండొచ్చు. మ‌రియు ఎక్కువగా పిల్లల్లో తమ తల్లిదండ్రుల ఇద్దరి పోలికలు కలుస్తాయి. అయితే మగపిల్లాడు తల్లి పోలికలతో పుడితే అదృష్టమని .. ఆడపిల్ల తండ్రి పోలికలతో పుడితే అదృష్టమ‌ని మన పెద్దలు చాలా సంద‌ర్భాల్లో చెడుతుంటారు. వాటిలో ఎంత నిజం ఉందో తెలీదు కానీ.. తండ్రి పోలికలతో పుడితే ఆ బిడ్డలు ఆరోగ్యవంతులు అవుతారంటున్నారు పరిశోధకులు.

 

అవును! మీరు విన్న‌ది నిజ‌మే. తండ్రి పోలికలతో పుట్టిన పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవ్వరట. ఇతరులతో పోలిస్తే.. అచ్చుగుద్దిన‌ట్టు తండ్రి పోలికలతో పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని కొన్ని ప‌రిశోధ‌న‌లో తేలింది.  బిడ్డ పోలికలకీ, ఆరోగ్యానికీ మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకునేందుకు అమెరికాలో కొన్ని ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు.  ఇందుకోసం బిడ్డ ఒక చోట తండ్రి మరో చోట ఉండే కొన్ని కుటుంబాలని అక్క‌డ ప‌రిశోధ‌కులు సెలెక్ట్ చేసుకున్నారు.

 

ఈ క్ర‌మంలోనే బిడ్డ‌లు తండ్రి పోలికతో ఉంటే వాళ్ల మీద తండ్రికి ఎక్కువ ప్రేమ కలుగుతుందని వీరి పరిశోధనలో వెల్ల‌డైంది. అంతేకాకుండా ఎక్కువ రోజులు తమ పిల్లలతో గడిపేందుకు తండ్రులు ఇష్టపడతాడట. పిల్లలతో ఎక్కువ సమయం గడపడమే కాకుండా వారి విషయంలో మ‌రింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారనీ, అదే వారిని ఆరోగ్యంగా ఉంచుతుందని పరిశోధకులు వెల్ల‌డించారు. అయితే పోలికలు ఒక్కటే పిల్లలను ఆరోగ్యంగా ఉంచవనీ.. వారి విషయంలో తల్లిదండ్రులు తీసుకునే కేరింగ్‌ వారిని ఆనందింప‌చేయ‌డంతో ఆరోగ్యంగా ఉంటార‌ని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: