కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన క్రమంలో వ్యక్తిగత శుభ్రత మాత్రమే దీనికి ప్రాధమిక మందని అంటున్నారు వైద్యులు. కేవలం నోరు, కళ్ళు, ముక్కు , చెవుల ద్వారా మాత్రమే ఇది శరీరంలోకి ప్రవేశిస్తుందని తద్వారా కరోనా వ్యాధి బారిన మనిషి పడుతున్నాడని తెలుస్తోంది. అయితే చేతులు పరిశుభ్రంగా కడగటం వలన ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించకుండా కట్టడి చేయచ్చని అందరికి ప్రభుత్వం వివిధ రకాల ప్రచారాల ద్వారా తెలియచేయడంతో ప్రతీ ఒక్కరికి వ్యక్తిగత శుభ్రతపై అవగాహన వచ్చింది. అయితే

IHG

శానిటైజర్స్ ఉపయోగించి చేతులని శుభ్రం చేసుకుంటే కరోనా వైరస్ చనిపోతుందని ప్రచారం కావడంతో అందరూ ఒక్క సారిగా శానిటైజర్స్ లెక్కకి మించి కొనేశారు దాంతో మార్కెట్ లో శానిటైజర్స్ కొరత ఏర్పడి అధిక రేటుకి  అమ్ముడు పోతున్నాయి. కానీ కరోనా వైరస్ ని తరిమి కొట్టడానికి కేవలం కెమికల్ శానిటైజర్స్ మాత్రమే కాదు పురాతన ఆయుర్వేద పద్దతుల ద్వారా చేసుకునే హోమ్ మేడ్ శానిటైజర్స్ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మరి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో హోమ్ మేడ్ శానిటైజర్ ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

 

కావాల్సిన పదార్ధాలు : వేపాకులు, పచ్చ కర్పూరం, స్వచ్చమైన పసుపు, కల్లుప్పు , రెండు గ్లాసుల నీళ్ళు.

IHG

తారుచేయు విధానం : ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి అందులో వేపాకులు వేయాలి. ఆ తరువాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు మరిగించాలి, ఇలా మరుగుతున్న క్రమంలోనే అందులో కల్లుప్పు, పసుపు , పచ్చ కర్పూరం వేసి మరో 10 నిమిషాలు మరిగించాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి ఒక చిన్న డబ్బాలోకి తీసుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలి. మనకి కావలసినప్పుడు ఆ మిశ్రమాన్ని తీసుకుని చేతులు శుభ్రం చేసుకోవచ్చు. పసుపు, పచ్చ కర్పూరం , వేపలో  ఉంటే యాంటీ ఫంగస్ గుణాలు ఎలాంటి వైరస్ ని అయినా తరిమి తరిమి కొట్టగలవు ఇదే పద్దతిని పూర్వం నుంచీ పూర్వీకులు పాటించేవారని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: