సాధార‌ణంగా గర్భం దాల్చడమనేది ఎంత అందమైన అనుభూతో ఆ తల్లికే తెలుస్తుంది. గర్భం దాల్చడం అనేది ఆ భగవంతుడు మహిళలకు ఇచ్చిన గొప్ప వరం. పెళ్లైన ప్ర‌తి మ‌హిళా త‌ల్లి కావాల‌ని కోరుకుంటుంది. అయితే వికారం, మార్నింగ్ సిక్నెస్, వాంతులు, అజీర్తి, తలనొప్పి, వంటి నొప్పులు, మరేదైనా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు వంటి సమస్యలు ఎన్ని ఎదురైనా, కడుపులో బిడ్డ ఉందన్న ఆనందం ముందు అవన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే కడుపులో ఉన్న‌ప్పుడు శిశువు ఎన్నో ప‌నులు నేర్చుకుంటాడు.. చేస్తారు. అయితే అవి మ‌న‌కు వింత‌గా ఉండే వాస్త‌వాలు.

 

మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నన్సీలో మూడు నెలలు దాటాక శిశువునకు వాసన తెలుస్తుంది. దుర్వాసన వలన కొంచెం ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతాడు. ఎంత విచిత్రంగా ఉంది కదా. అందుకే కడుపుతో ఉంటె చెడు వాసనకు దూరంగా ఉండండి. మ‌రియు మూడు నెల‌లు దాటాక క‌డుపులో శిశువు కలలు కూడా కంటుంద‌ట‌. విన‌డానికి విచిత్రంగా ఉన్నా కాని ఇదే నిజం. అయితే ఈ ప్రపంచాన్ని చూడని పిల్లలు ఏం కలలు కంటారు అనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకి అంతుచిక్కట్లేదు.

 

అలాగే 15 వారల వయస్సు గల శిశువు రుచికరమైన ఆహారాన్ని ఎక్కువగా స్వీకరిస్తాడంట. తీపి పదార్థాలు అయితే ఎక్కువ, చేదు, పిల్లవి తక్కువ స్వీకరిస్తాడ౦ట. అంతేకాదు.. ఏదైన పెద్ద శబ్దం విన్నా, దగ్గరగా ఎవ‌రైనా అరిచినా గర్భంలో బిడ్డ ఉలిక్కిపదుతుంద‌ట‌. మ‌రో గ‌మ్మ‌తైన విష‌యం ఏంటంటే.. గర్భంలో ఉనప్పుడే పిల్లలు నోట్లో వేలు పెట్టుకుని సప్పరిస్తార‌ట‌. ఇక గర్భం చివరి రోజుల్లో శిశువు మీ మాటలు అర్థం కాక‌పోయినా ఎంతో శ్రద్ద తో వింటూ ఉంటారంట. వాస్త‌వానికి ఇవి కాస్త వింత‌గా ఉన్నాకాని.. ఇవి నిజం అంటున్నారు నిపుణులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: