వేగాన్ (VEGON)..ఈ పదం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అసలు ఏమిటి ఇది. దీని అవసరం మానవాళికి ఎంత వరకూ ఉపయోగ పడుతుంది. అనే వివరాలలోకి వెళ్తే..జంతులని చంపి తినకుండా, వాటి నుంచీ వచ్చే పదార్ధాలని తినకుండా, వస్తువులని వాడకుండా ప్రాణులపై ప్రేమ చూపించడమే ఈ వేగాన్ ముఖ్య లక్ష్యం. అదేంటి జంతువులుని చంపి తినకుండా బ్రతికేదెలా అని నోళ్ళు వెళ్ళబెట్టే వారే షాక్ అయితే మరి శాఖాహారులు మరి ఇంకెంత షాక్ అవ్వాలి.

IHG

కనీసం పాలు, పెరుగు , తీసుకోక పొతే ప్రోటీన్లు మనిషికి ఎలా అందుతాయి. ముక్క లేనిదే ముద్ద దిగదు కదా అనుకుంటే వాటన్నిటికంటే కూడా అద్భుతమైన ప్రోటీన్లు ఇచ్చే వేగాన్ ఫుడ్ డైట్ ఇందులో ఉంటుంది.ఈ వేగాన్ ఫుడ్ డైట్ వలన కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుంటే ఔరా అని నోళ్ళు వెళ్ళబెడుతారు.

IHG

వేగాన్ అనేది కేవలం జంతులపై ప్రేమతో మాత్రమే మొదలవ్వలేదు. మనుషుల యొక్క భవిష్యత్తు ఆరోగ్య దృష్ట్యా కూడా ముందు చూపుగానే ఇది కార్యరూపం దాల్చింది. ముఖ్యంగా పలు దేశాలలో ఇది విస్తరించింది కూడా. మన దేశంలో ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. ప్రతీ ఒక్కరూ  ప్రకృతిని , ప్రాణి కోటిని రక్షించుకునేలా కార్యరూపం దాల్చుతోంది. మరి ఈ వేగాన్ ఫుడ్ తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 

  • ఈ వేగాన్ ఫుడ్ తీసుకోవడం వలన క్యాన్సర్ వచ్చే అవకాశమే లేదని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి కారణం ప్రాసెస్ చేసిన మాంసం తినడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మాంసం తింటే ఎలాంటి పరిణామాలు జరిగుతాయో తెలిపింది. సో ముందు మాంసం తినే పద్దతి వేగాన్ డైట్ లో ఉండదు.

 

  • డయాబెటిస్ రానేరాదు. ప్రపంచంలో అత్యధిక మందిని ప్రస్తుతం పట్టిపీడిస్తున్న సమస్య ఇది. దీని వలన మనిషి పూర్తిగా అనారోగ్య స్థితికి చేరుకుంటాడు. సగానికి సగం మంది ప్రజలు అధిక కొవ్వుని కలిగిన ఆహరం, పాల ఉత్పత్తులు , తీసుకోవడం వలనే ఈ డయాబెటిక్ వ్యాప్తి చెందుతోంది ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా మానేస్తే శరీరంలో ఇన్సులిన్ క్రమ పద్దతిలో ఉంటుంది పళ్ళు , కూరలు తీసుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వేగాన్ డైట్ ద్వారా డయాబెటిస్ తగ్గిన రోగులు కూడా ఉన్నారని పరిశోధకులు అంటున్నారు.

 

  • హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు అస్సలు ఉండవు. ఎప్పుడైతే కొవ్వు అధికంగా ఉండే పదార్ధాలు తీసుకోమో అప్పుడు మనం హార్ట్ ఎటాక్ నుంచీ తప్పించుకున్నట్టే అంటే వేగాన్ డైట్ లో పాలు , మాంసం లకి చోటులేదు సో శరీరంలో కొవ్వు పేరుకుని పోయే అవకాశమే లేదు. దీనిద్వారా రక్త నాళాలు మూసుకుని పోకుండా పూర్తిగా స్వేచ్చగా రక్తం ప్రవహిస్తుంది. దీని ద్వారా గుండె వ్యాధులు వస్తాయనే ఆలోచనే ఉండదు.

 

  • ఇక చక్కటి చర్మం..అందమైన ముఖ వచ్చస్సు మీ సొంత అవుతుంది. వేగాన్ డైట్ ని తప్పకుండా తెలుకుని ఫాలో అయ్యే వారికి అధిక బరువు ఉండనే ఉండదు. ఈ విషయాలు స్వయంగా అనుభవం అవ్వాలంటే కనీసం 3 నెలలు వేగాన్ డైట్ ఫాలో అవ్వమని అంటున్నారు నిపుణులు. ఆ తరువాత మీ నిర్ణయం మీరే తీసుకోవచ్చునని ఎంతో ఖచ్చితంగా చెప్తున్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: