సాకారమైంది ఏదైనా రెండు సార్లు తయారవుతుందట. మొదటి సారి మనిషి మస్తిష్కంలో.. రెండోసారి వాస్తవ రూపంలో. అంటే ఏదైనా ఆవిష్కరణ, సేవ, ఉత్పత్తి ఏదైనా సరే సాకారం కావాలంటే.. ముందు దాని గురించిన అవగాహన ఉండాలి.

 

 

దానికి సంబంధించిన మేథోమథనం జరగాలి. అదంతా జరిగేది మానవ మస్తిష్కంలోనే. మీ ఊహలకు అనంతమైన శక్తి ఉంటుంది. చాలా మంది పగటి కలలు కనకు.. అంటుంటారు. కానీ వాస్తవానికి పగటి కలలు కనాలి. మనకు ఏం కావాలో అది కలగనాలి.. మనం ఏం కాదలుచుకున్నామో అది కలగనాలి.

 

 

మనం ఏం సాధించదలచుకున్నామో అది కలగనాలి. మనం సాధించేసినట్టు ఊహించుకోవాలి. ఈ ఊహ మీకు అనంతమైన శక్తిని ఇస్తుంది. అందుకే మహానుభావుడు అబ్దుల్ కలామ్ యువతకు పదే పదే చెప్పేవారు. కలలు కనండి.. ఆ కలలు నిజం చేసుకునేందుకు ప్రయత్నించండి అని.

 

 

అసలు మనిషిగా పుట్టడం ఒక వరమైతే.. అద్భుతమైన ఊహాశక్తి కలిగి ఉండటం మరో వరం. మనిషి పురోగతికి మూలకాలం ఈ ఊహాశక్తే కదా. మానవుడికి ఊహన్నది లేకపోతే ప్రపంచం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. అందుకే ఊహల్లో బతికేయండి.. ఆ ఊహలు నిజం చేసుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: