ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య ఒక్కటే కరోనా. కరోనా వచ్చిందంటే చచ్చినట్టే అన్నట్టుగా కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారం చూస్తుంటే కరోనాతో కాదు ముందు గుండె పోటుతో చచ్చేలా ఉన్నారు జనం. అసలు కరోనా వస్తే ఏమి చేయాలి..రాకుండా ఏమి చేయాలి అనే జాగ్రత్తలు ప్రజలకి అర్థమయ్యేలా వివరించి చెప్తున్న వారి సంఖ్య వేళ్ళమీద లెక్క బెట్టుకోవచ్చు. బయట నుంచీ ఇంట్లోకి వస్తే కరోనా మనతో పాటు వచ్చిందేమో ననే భయం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది ఇది సహజమే..అయితే కరోనా లక్షణాలు ఉన్నాయని మీకు అనిపిస్తే ఏమి చేయాలి..ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

IHG's statement on COVID-19 federal response | The ...

చాలా మంది తుమ్ము వచ్చినా..దగ్గు వచ్చినా కొద్ది పాటి తలనెప్పి వచ్చినా కరోనా వచ్చిందేమో నని కంగారు పడిపోతున్నారు. కంగారు పడటం కరక్టే కానీ ఈ కంగారుతో కొత్త అనర్ధాలు తెచ్చుకునే అవకాశాలే ఎక్కువ.  ముందుగా దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళండి. మనకి కరోనా ఉండక పొవచ్చు కానీ ఆసుపత్రికి వచ్చే వారిలో ఎవరికైనా కరోనా ఉంటే అది మనకి సోకే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరిని ముట్టుకోకుండా సామాజిక దూరం పాటించండి. ముక్కుకి చేతులకి మాస్క్ లు తప్పని సరి. అలాగే మీతో పాటు ఒక శానిటైజర్ కూడా తీసుకు వెళ్ళండి. ఎందుకంటే పొరబాటున మీరు ఏ వస్తువుని ముట్టుకునా వెంటనే శానిటైజర్ రాసుకునే అవకాశం ఉటుంది లేకపోతే మీరు పనిలోపడి మర్చిపోయి అదే చేత్తో కళ్ళు ముక్కులని ముట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి..

IHG

ఒక వేళ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద క్యూ లైన్ ఉంటే..ప్రభుత్వం వారు ఏర్పాటు చేసే హెల్ప్ లైన్ నెంబర్ లకి కాల్ చేయండి. మీకు కరోనా లక్షణాలు ఉన్నాయోమో నని అనుమానంగా ఉందని చెప్పండి. మీ సాంపిల్స్ తీసుకోమని చెప్పండి. నేను బయటకి వెళ్ళలేను అని కూడా చెప్పండి. వారు తప్పకుండా మీ ఇంటికి వచ్చి సాంపిల్స్ తీసుకుని వెళ్తారు. ఇంటి దగ్గర స్వయంగా క్వారంటైన్ లో ఉండండి..మీ సాంపిల్స్ వచ్చి మీకు కరోన అలేదని తేలేవరకూ మీరు క్వారంటైన్ లో ఉండాల్సిందే లేదంటే మీ ఇళ్లలో వారికి మీ పెంపుడు జంతువులకి కూడా కరోనా సోకవచ్చు.

IHG

అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే..మీరు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్న సమయంలో అంటే కరోనా ఉందని మీరు అనుమానం చెందినపుడు మీతో పాటు ఎవరైతే కొన్ని రోజులుగా కలిసి ఉన్నారో వారికీ మీరు జాగ్రత్తలు చెప్పండి. ఒక వేళ కరోన పాజిటివ్ అని వస్తే ముందుగానే వారిని హెచ్చరించడం వలన వారుకూడా అలెర్ట్ అవుతారు. ఒక వేళ కరోనా పాజిటివ్ గనుకా మీకు వస్తే మీరు ఇంట్లో సానిటైజ్ చేయండి. అలాగే తలుపులు, కిటికీలు, వస్తువుల్ని కూడా సానిటైజ్ చేయాల్సిందే. కేవలం డాక్టర్ సలహాలు మాత్రమే తీసుకోండి. సొంతగా ప్రయోగాల జోలికి వెళ్ళకండి. 

IHG

కరోనా మీకు పాజిటివ్ అని తెలిస్తే మీరు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని ఏమిటంటే..మిమ్మల్ని తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కి తీసుకువెళ్ళి చికిత్స అందిస్తారు. ఈ క్రమంలోనే మీరు ఆత్మ స్థైర్యం ఎట్టిపరిస్థితుల్లోనూ ఇది కోల్పోవద్దు. మానసికంగా మనం ఎంత ధృడంగా ఉండే అంత తొందరగా ఈ రోగాన్ని జయించగలం. మనకి ఏమి కాదు అనే ఆలోచనే మనకి ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: