ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల‌ను త‌న రాజ్యంగా ప‌రిపాలిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందులు పెట్ట‌డ‌మే కాకుండా.. ప్రాణాలు సైతం బ‌లితీసుకుంటోంది. అయితే దీనిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భాత్వాలు ఇప్ప‌టికే లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠ‌ణ చ‌ర్య‌లు సైతం తీసుకుంటున్నారు. ఇక లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. అయితే ఇళ్ల‌ల్లో ఉండాలంటే కొంద‌రికి పెద్ద స‌మ‌స్యే అని చెప్పాలి. ఎందుకంటే.. తినే తిండిని తగ్గించుకోలేరు. అలా అని..  జిమ్‌కో, పార్కుకో వెళ్లి ఎక్సర్ సైజులు చేయలేరు.

 

అయితే ఇలాంటి వారు ఎలాంటి చింతా ప‌డ‌క్క‌ర్లేదు. ఇంట్లోనే ఎంతో సులువుగా బ‌రువు పెర‌గ‌కుండా చేసుకోవ‌చ్చు. అధికబరువు తగ్గేందుకు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకునేవారు గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ముఖ్యంగా పొట్ట పెరగకుండా ఉండేందుకు గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతోంది. అలాగే ఇంట్లోనే ఉంటూ సింపుల్ ఎక్సర్‌సైజులు చెయాలి. మెట్లు ఎక్కి దిగడం, డాబాపై రౌండుగా నడవడం, స్కిప్పింగ్ చేయ‌డం, బ‌ట్ట‌లు చేతుల‌తో ఉత‌క‌డం వంటి చేయాలి.

 

అదేవిధంగా, తక్కువ తిను... ఎక్కువ సార్లు తిను. త‌క్కువ మోతాదులో టిఫిన్, లంచ్, డిన్నర్ ఎన్ని సార్లు తిన్నా అది ఆరోగ్యానికి మంచిదే. అలా కాకుండా ఒకేసారి అధిక మోతాదులో తీసుకోకూడ‌దు. దీని వ‌ల్ల అధిక బ‌రువు పెరిగిపోతారు.  ఆకు కూరలు, కూరగాయల ఆహారం ఎక్కువగా తినాలని చెబుతున్నారు. మ‌రియు మొలకెత్తిన పెసలు బ‌రువు త‌గ్గ‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిలో ఎ, బి, సి, ఇ, విటమిన్లు ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం..మాంసకృత్తులు, పీచు..వంటివెన్నో పోషకాలు లభిస్తాయి. కొవ్వును కరిగించడంతోపాటు..శరీర బరువును అదుపులో ఉంచుతాయి.  
  

మరింత సమాచారం తెలుసుకోండి: