గ‌ర్భం పొంద‌డం అనేది మ‌హిళ‌కు ఓ వ‌రం లాంటిది. ఇక గర్భవతి అని తెలిసిన క్షణం నుంచి పుట్టబోయే బిడ్డను గూర్చి ఎన్నో కలలు కంటుంది. మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే పుట్టబోయే బిడ్డ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అందులోనూ ముఖ్యంగా ఆహార విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌కుండా తీసుకోవాలి. తల్లి తీసుకునే ఆహారమే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేస్తుంది. గర్భాధారణ సమయంలో శరీరానికి విటమిన్లు, మినరల్స్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. 

 

ఇందులో భాగంగా ప్రెగ్నెన్సీ మ‌హిళ బెల్లం తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో బెల్లం తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచ‌డంతో పాటు తక్షణ శక్తిని కూడా పొందొచ్చు. అలాగే బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ మ‌హిళను రక్తహీనత నుండి దూరంగా ఉంచుతుంది. బెల్లం లో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు కాల్షియం ఎముకలు, కీళ్లకు పోషణ అందించి.

 

దీంతో గర్భధారణ సమయంలో వేధించే కీళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు. అదేవిధంగా, ప్రెగ్నన్సీ సమయంలో బెల్లం తినడం వల్ల శరీరంలో వ్యర్థాలను తొలగించి మీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది లోపల పెరుగుతున్న బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అందించ‌మే కాకుండా.. ఎదుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇక బెల్లం గ‌ర్భిణీ స్త్రీల‌కే కాకుండా సామాన్య‌ల‌కు సైతం ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. కాబ‌ట్టి.. ప్ర‌తి ఒక్క‌రూ రోజు త‌గిన మోతాదులో బెల్లం ముక్క తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: