ఎవరైనా పగటి కలలు కంటుంటే.. గాల్లో మేడలు కడుతున్నాడు అంటారు. వాస్తవానికి గాల్లో మేడలు కట్టొచ్చని మీకు తెలుసా.. అవును నిజమే.. గాలిలోనూ మేడలు కట్టొచ్చు. అంటే గాలిలో కడతామని కాదు.. ఊహించుకున్న వాటికి వాస్తవ రూపం తీసుకురావచ్చు. వాస్తవానికి అలాంటి ఊహాశక్తే విజయాలకు మూల కారణం అవుతుంది.

 

 

కాకపోతే.. కేవలం ఆ ఊహాశక్తికి చిత్తశుద్ధి, శ్రమ శక్తి తోడవ్వాలి. అప్పుడు ఊహలు కూడా వాస్తవాలు అవుతాయి. అంతెందుకు ఇప్పుడు సాకారమైనవి.. ఔరా అనిపిస్తున్నవి కూడా ఒకప్పటి మహనీయుల ఊహలే కదా. చందమామను అందుకోవాలని ఊహించడం వల్లే కదా.. నేడు చంద్రుడిపై కాలుమోపేలా చేసింది. తీగలో విద్యుత్తు ప్రవహిస్తుంది అన్నది ఊహ.

 

అంతెందుకు మనం నిత్యం పూజించే దైవం మాత్రం ఊహ కాదూ. అయితే ఈ ఊహ మన శక్తిని ప్రేరేపించేదిగా ఉండాలి. మన శ్రమకు దిక్సూచిగా ఉండాలి. మన గమ్యాన్ని గుర్తు చేసేదిలా ఉండాలి. అంతే కానీ.. వాస్తవ జీవితం అంటే భయపడే కేవలం ఊహాలోకంలో విహరించడం మాత్రం సరైంది కాదు. జీవితం విలువ తెలిసినవారు అలాంటి పొరపాట్లు చేయరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: