పిల్ల‌లు విష‌యంలో త‌ల్లిదండ్రులు ఎంతో కేరింగ్‌గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో తల్లిదండ్రులు ఎన్నో ముఖ్య విషయాలు పాటించాలి. అప్పుడే చిన్నారులకు మంచి భవిష్యత్‌ని అందించిన వారుగా ఉంటాం. ముఖ్యంగా పిల్ల‌ల విష‌యంలో  ఓ మిలటరీ ట్రైనింగ్‌లా కాకుండా వాళ్ల‌తో ఆడుతూ పాడుతూ మంచి ఫ్రెండ్స్‌గా ఉంటాలి. అలాగే రోజంతా వాళ్ళు స్కూల్లో టీచర్లు చెప్పిన పాఠాలు వినడం, నోట్స్ రాసుకోవడం, పరీక్షలు, ఆటలు, ఇలా బిజీబిజీగా గడుపుతుంటారు. ఇక‌ తీరా ఇంటికొచ్చేసరికి అలసిపోయి.. తినేసి ప‌డుకుంటారు.

 

మ‌రి వీరిని ఎప్పుడు చ‌దివించాలి.. మ‌రీ ముఖ్యంగా చ‌దివిందీ పిల్ల‌ల‌కు బాగా గుర్తుండాలంటే ఏం చేడాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. చదివేటప్పుడు పూర్తి ఏకాగ్రత పెట్టటం ఎంతైనా అవసరం. దీనివల్ల తక్కువ సమయంలో అర్థం చేసుకోవడం వీలవుతుంది. లేకుంటే ఎంత‌సేపు చ‌దివినా.. అది బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుంది. పిల్ల‌లు చ‌దువుకునేట‌ప్పుడు చుట్టూ పక్కలా ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వాళ్ల‌కు చ‌దివింది బాగా మైండ్‌లోకి ఎక్కించుకుంటారు. 

 

అలాగే తెల్లవారు జామున ఆహ్లాద వాతావరణంలో కూర్చొని చదువుకొంటే మరచిపోవటమనే సమస్య తక్కువ. మ‌రియు కేవలం చదివి సరిపెట్టకుండా ఒక సారి రాసి చూసుకోవటం, ఆడియో పాఠాలు వినటం, స్నేహితులకు వివరించి వారి అభిప్రాయం కోరటం చేస్తే బాగా గుర్తుండిపోతుంది. పిల్లలు చ‌దివింది బాగా గుర్తుండాలంటే.. వాళ్లు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే పిల్లలకు పండ్లు, కూరగాయలు, త్రుణధాన్యాలు వంటివి పోషకాహారంను మీ రెగ్యులర్ డైట్ లో ఒక భాగంగా అందించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: