ప్ర‌తి మ‌నిషి జీవితంలో శృంగారం అనేది ఉంటుంది. అయితే ఇది చాలా ముఖ్య‌మైన ఘ‌ట్ట‌మ‌ని చెప్పాలి.  అలాగే భార్య‌భ‌ర్త‌ల జీవితంలో శృంగారం అనేది ఓ ముఖ్య భూమిక పోషిస్తి. అయితే దీనిలో అనుసరిస్తున్న వింత పోకడలు జీవితాలని నాశనం చేస్తోందని ఓ సర్వేలో తేలింది. శృంగారం విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు తెలియక చాలా మంది జంటలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ శృంగారంలో ఈ తరం జంటలు అనుసరిస్తున్న విధానాల విషయంలో సర్వే నిర్వహించింది.

 

ఇక ఈ సర్వేలో 20 శాతం మంది జంటలు తమ శృంగారాన్ని స్మార్ట్ ఫోన్‌లో వీడియోలు తీసుకోవడానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నార‌ట‌.  అయితే దీన్నిచాలా మంది తప్పుబ‌డుతున్నారు. అదేమి అల‌వాట‌ని అలా చేయ‌డ‌మేంట‌ని తెగ కోపం తెచ్చుకుంటున్నారు. అంతేకాక అలా చేయ‌డ‌మ‌నేది ఈ వింత పోకడ అతి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. సరదాకు చేసే ఈ పిచ్చి పని వలన వారితో పాటు మిగిలిన సమాజం పై కూడా ఈ ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాక ఈ వీడియోల‌ను మ‌రెవ‌ర‌న్నా చూసినా మ‌న‌కు తెలిసిన మ‌న కుటుంబ స‌భ్యులు చూసిన ఎంత అస‌హ్యంగా ఉంటుందో ఆలోచించ‌డం లేదు.  నేటి యువ‌త ఇలాంటి వాటి పైన ఎందుకింత ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారో తెలియ‌డం లేదు. 

 

పొరపాటున ఆ దృశ్యాలు నెట్ లోకి వెళ్ళి సోషల్ మీడియాలోకి చేరితే వాటి వ‌ల్ల వ‌చ్చే అవాంత‌రాలు డివోర్స్, సూసైడ్‌లు, మనస్పర్థలు వంటి అంతర్థాలకు దారి తీసే అవకాశం ఉంది. దీనిపైనా ప్రముఖ కండోమ్ తయారీ సంస్థ మాన్ ఫోర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్‌ని కూడా మొదలు పెట్టింది. మ‌రి ఇలాంటి దుశ్చ‌ర్య‌లు చేయ‌డం మాత్రం స‌రైన‌ది కాద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఒక‌ప్పుడు శృంగారం గురించి మాట్లాడ‌టం అంటేనే చాలా సిగ్గుప‌డేవారు. దాని గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడ‌టం అస‌లు ఇష్ట‌ప‌డేవారే కాదు కాని ఇప్పుడు ఇలాంటి ఘోర‌మైన ఆలోచ‌న‌లు క‌లుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: