అధిక‌ బ‌రువు.. నేటి కాలంలో ప్ర‌తి ఒక్క‌రిని ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య‌. ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. నోరు కట్టేసుకోవడంతోపాటు గంటల తరబడి వ్యాయామం చేసినా ఒక్క కిలో బరువు కూడా తగ్గదు.   ఈ అధిక బరువు ఉన్నవారి కోసం  పట్టణాలలో అనేక వ్యాయామ శాలలు, అలాగే అనేక ఆసుపత్రిలు కొత్త రకమైన ట్రీట్ మెంట్ లతో  చాలా డబ్బులు గుంజుతున్నారు. అయితే వాస్త‌వానికి మ‌నం చేసే కొన్ని త‌ప్పుల వ‌ల్లే అధిక బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణాలు.

 

ముఖ్యంగా అధిక బ‌రువు త‌గ్గాలంటే రాత్రివేళ కొన్ని ఆహార ప‌దార్థాల‌కు మాత్రం దూరంగా ఉండాలి. అవేంటి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముందుగా నట్స్. అవును! ఆరోగ్యానికి న‌ట్స్(బాదం, వాల్‌నట్, జీడిపప్పు, పిస్తా, కిస్ మిస్‌) మంచివే కానీ, వీటిలో కేలరీలూ ఎక్కువే. అందువల్ల పడుకునేముందు వీటిని తినకూడదు. ఎందుకంటే వీటిని తిన్నాక ఎక్సర్‌సైజ్ చేయకపోతే, ఇవి కొవ్వుగా మారి.. శ‌రీరంలో స్టోర్ అవుతాయి. ఫలితంగా బరువు పెరుగుతూ ఉంటాము. అలాగే చాకొలెట్.. చాలా మంది ఆ టైమ్‌.. ఈ టైమ్ లేకుండా ఎప్పుడుప‌డితే అప్పుడు తింటారు. 

 

డార్క్ చాకొలెట్స్  గుండెకు, బ్రెయిన్‌కీ మంచివే. కానీ వాటిని నిద్రపోయేముందు మాత్రం తినకూడదు. వాటి నిండా షుగర్, ఫ్యాట్ ఉంటుంది. అందుకే వాటిని దూరం పెట్టాలి. ఇలా కూడా అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు. అదేవిధంగా, ఫ్రూట్ జ్యూస్ రాత్రివేళ అస్స‌లు తాగ‌కూడ‌దు. ముఖ్యంగా కమర్షియల్ ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మ‌రియు షుగర్ ఉండే సోడా లాంటి డ్రింక్స్ బరువు తగ్గాలనుకునేవారికి యాంటీగా ప‌నిచేస్తాయి. ఎందుకంటే సోడాల వల్ల ఏ పోషకాలూ ఉండ‌వు. మ‌రియు వాటిలో కేలరీలు ఎక్కువ. అందుకే సోడాలు తాగితే బరువు పెరిగిపోతారు. కాబ‌ట్టి రాత్రివేళ సోడాలు మాత్రం తాగ‌కండి.

మరింత సమాచారం తెలుసుకోండి: