గణితంలో సూపర్‌ కంప్యూటర్‌లాంటి వ్యక్తి, మేథమెటిషీయన్‌, హ్యూమన్‌ సూపర్‌ కంప్యూటర్‌గా పేరుగాంచిన శకుంతల దేవి. శకుంతలా దేవి  నవంబరు 4, 1929 న జన్మించారు. శకుంతలా దేవి బెంగళూరు నగరంలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.  ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త.  ప్రపంచంలో అతి వేగంగా గణనలు చేయడంలో ఆమె దిట్ట.. అందుకే ఆమెకు గిన్నిస్ వరల్డ్ రికార్డును స్వంతం చేసుకున్నారు. ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలా దేవి మైసూరు విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు.

 

ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు. 1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తో శకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా ఆ సమస్యను అత్యంత వేగంగా క్యాలిక్ లేట్ చేసి కంప్యూటర్ నే ఓడించారు.   ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది.

 

దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. అంతే ఆమె సమాధానం విన్న అక్కడి వారంతా ఆమె మేధోశక్తికి దాసోహం అయ్యారు.. అందుకే ఆమెకు గిన్నిస్ బుక్ చోటు కల్పించారు. 18 ఏళ్ల విద్యార్థులు చేయాల్సిన లెక్కలు శకుంతల దేవి తన 5ఏళ్ల ప్రాయంలోనే చేసేసి1982లో గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కింది. ఈమె మేథమెటిషీయన్‌, ఆస్ట్రాలజర్‌, కుక్‌బుక్‌ రచయిత, నవల రచయిత కూడ ఆమె ప్రసిద్ది చెందారు.  తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: