కరోనా మహమ్మారి దెబ్బకి దేశాలకి దేశాలు దిక్కు తోచని స్థితిలోకి కొట్టుమిట్టాడుతున్నాయి. అన్ని వ్యవస్థలు స్థంభించి పోయాయి. దాంతో  కరోనాని కంట్రోల్ చేయాలంటే తప్పకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు సూచనలు చేసింది. అంతేకాదు కరోనా సోకిందనే అనుమానం ఉన్న  వ్యక్తిని  అబ్జర్వేషన్ లో ఉంచాలని 14 రోజుల సమయం తరువాత లక్షణాలు బయటపడినప్పుడు ట్రీట్మెంట్ చేయాలని కూడా సూచించింది..

IHG

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సమయం కంటే కూడా కేరళా ప్రభుత్వం అనుమానిత వ్యక్తిని మరో 10 రోజులుపైగానే  అంటే    24 రోజుల పాటు  క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసులు వచ్చినా వారి వైద్య విధానం వలన తొందరగా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అయితే కేరళ వైద్యులకి ఓ కేసు పెద్ద తలనెప్పి తెచ్చిపెట్టింది. ఇంతకీ అంతగా తెలనెప్పి కగాలగానికి కారణం ఏమిటంటే..

IHG

కేరళాలో 68 ఏళ్ళ వయసున్న ఓ బామ్మ కి ఇప్పటి వరకూ 19 సార్లు కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ ఉందని తేలింది. కానీ ఆమెకి కరోనా కి చెందిన ఒక్క లక్షణం కూడా బయట పడక పోవడం  వైద్యులని షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఎన్ని మందులు వాడినా సరే కరోనా తీవ్రత తగ్గడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఇటలీ నుంచీ వచ్చిన ఓ ఫ్యామిలీ ద్వారా ఆమెకి కరోనా సోకిందని గుర్తించిన ప్రభుత్వం మిగిలిన వారికోసం గాలింపు మొదలు పెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: