పొద్దున లేచీలేవగానే గడియారంతో పోటీ.. ఇప్పుడంటే లాక్ డౌన్ లో ఉన్నారు కానీ.. అంతకు ముందు ఎంత బిజీగా గడిపేవారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. అటు ఆఫీసు టెన్షన్స్.. ఇటు ఇంట్లో టెన్షన్స్.. మరోవైపు బడ్జెట్ లెక్కలు.. అబ్బా.. ఏంటీ జీవితం అని చాలాసార్లు అనిపించే ఉంటుంది కదా.

 

 

కానీ ఆ ప్రశ్న సీరియస్ గా ఎప్పుడైనా వేసుకున్నారా.. ఏ ప్రశ్న అంటారా.. అదే ఏంటీ జీవితం అని.. ఇల్లు, ఆఫీస్, రొటీన్ రొటీన్ ఇంతేనా మీ జీవితం.. ఇంతకు మించి ఏమీ లేదా.. అని ఆలోచించారా.. అసలు మీ జీవితానికి ఓ పరమార్థం అంటూ ఏంటన్న ఆలోచన వచ్చిందా.. ఆ హడావిడిలో వచ్చి ఉండదు లెండి.

 

 

కానీ ఇప్పుడు తీరికగా ఉన్నారుగా ఓ సారి ఆలోచించండి. ప్రశాంతంగా.. మీలో ఏదైనా తెలియని అసంతృప్తి ఉందా.. అసలు మీరు జీవితంలో ఏం కావాలనుకున్నారు. మీ ప్రయాణం అనుకున్నట్టు సాగుతోందా.. లేదా ఏదైనా మిస్ అవుతున్నారా.. ఇలాంటి ప్రశ్నలకు తీరికగా సమాధానం వెదికే పని చేయండి.

 

 

బహుశా ఇంత మంచి అవకాశం మీకు మళ్లీ ఎప్పుడూ రాకపోవచ్చు. ఈ ప్రశ్నలకు మీకు సమాధానం సంతృప్తికరంగా ఉంటే ఓకే.. కానీ ఏమాత్రం అసంతృప్తిగా ఉన్నా దాన్ని విశ్లేషించుకోండి. అప్పుడు ఏం చేయాలో మీకే మార్గం కనిపిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: