మహా భాగవతంతో శ్రీకృష్ణుని రాసలీలలు అన్నీ ఇన్నీ కావు. 16 వేల మంది గోపికలతో శ్రీకృష్ణుడు రాసలీలలు సాగిస్తాడు. వాళ్లని అల్లరి పెడతాడు. వారితో ఆడిపాడతాడు. ఈ రాసలీలలకు ఆధ్యాత్మికంగానూ ఎంతో ప్రాధాన్యం ఉంది. మరి ఈ శ్రీకృష్ణుని రాసలీలలతో మనం నేర్చుకునేది ఏమిటా అంటారా..?

 

 

శ్రీ కృష్ణుడు వేల మంది గోపికలతో ఆడిపాడినా.. అల్లరి పెట్టినా.. అంతా అల్లరి వరకేనట. వారితో శృంగారం మాత్రం లేదని చెబుతారు. అందుకు చిహ్నంగానే శ్రీకృష్ణ పరమాత్ముడు నెమలి ఫించాన్ని తలపై ధరిస్తాడట. ఎందుకంటే.. సకల చరాచర సృష్టిలో సంభోగం చెయ్యని ఏకైక ప్రాణి నెమలి మాత్రమేనని చెబుతారు.

 

 

శ్రీకృష్ణునికి 16,000 వేలమంది గోపికలు. అన్ని వేలమంది గోపికలతో శ్రీకృష్ణుడు సరసల్లాపాలు మాత్రమే ఆడాడు. అల్లరి చేసి గెలిచేవాడు. ఆ విషయాన్ని తెలియచేయటానికే శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరిస్తాడు. శ్రీకృష్ణుడు ఒట్టి అల్లరి కృష్ణుడు మాత్రమే.

 

 

మనం కూడా ఈ భౌతిక కార్యకలాపాలను శ్రీకృష్ణునిలా తామరాకు మీద నీటిబొట్టులా సాగించాలి. ఏదీ పూర్తిగా మనసుకు ఎక్కించుకోకూడదు. సంసార బంధాలను, బాధ్యతలను గోపికల్లా భావించాలి తప్పతే.. వాటితో మమేకం అయిపోకూడదు. ఆ స్పృహ ఎప్పుడూ ఉండాలి. ఇదే శ్రీకృష్ణుని రాసలీలల నుంచి మనం నేర్చుకునే అంశం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: