గుడ్లగూబ.. పెద్ద కనుగుడ్లతో అందవికారంగా ఉండి రాత్రిపూట తిరిగే ఈ పక్షి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అయితే గుడ్లగూబ ను చాలామంది అశుభసూచిక పక్షిగా భావిస్తూ ఉంటారు. అది ఇంట్లోకి వస్తే కొంత కాలంపాటు ఆ ఇల్లే వదిలి పెట్టాలని కూడా అంటుంటారు. మ‌రియు దానిని చూడటానికే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే అది మిగతా పక్షులకు భిన్నంగా కనిపించడమే కాకుండా, జరగనున్న కీడుకు అది సంకేతమని భావిస్తారు. కానీ హిందూ పురాణాల ప్రకారం.. గుడ్లగూబకు చాలా విశిష్ట స్థానం ఉంది. 

 

గుడ్లగూబను సాక్షాత్తూ ఆ మహాలక్ష్మీకి వాహనంగా పరిగణిస్తారు. రాత్రి నాల్గవ జాము తర్వాత..  గుడ్లగూబ ఎవరి ఇంటి మీదైతే వాలుతుందో.. ఆ రోజు నుండి ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంద‌ని కూడా చెబుతుంటారు. అయితే వీటిలో వాస్త‌లు ఎన్ని ఉన్నాయి అని ప‌క్క‌న పెడితే.. ప్ర‌తి రోజు గుడ్లగూబల్ని లేదా గుడ్డ‌గూబ ఫోటోను చూడ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ట‌. గుడ్లగూబ కళ్లలో కళ్లు పెట్టి ప‌ది నిమిషాలు చూడ‌డం వ‌ల్ల లోతుగా, నిశితంగా, స్పష్టంగా, కచ్చితత్వంతో ఆలోచించే అలవాటు పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఇందుకు ప్రాధాన కార‌ణం  దాని కళ్లలో ఉన్న శక్తే.

 

అలాగే గుడ్లగూబలు చీకట్లో కూడా స్పష్టంగా చూడగలవు. మనం అలాంటి శ‌క్తి లేదు. కానీ వాటి కళ్లను నిశితంగా చూడటం వల్ల మన మెదడులో చూపుకి సంబంధించిన భాగాలు మరింత చురుకుగా త‌యార‌వుతాయి. అలాగే గుడ్లగూబ ఫోటోలో కళ్లలోకి కళ్లు పెట్టి దాదాపు ప‌ది నిమిషాలు చూస్తే.. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని మనం చూసే కోణం మారుతుంది. అంటే.. ప్రతీదీ నిశితంగా ఏకాగ్రతతో చూస్తామని పరిశోధక‌లు అంటున్నారు. మ‌రియు ప్రతీ విషయంపైనా ఆసక్తి పెరుగుతుంద‌ని అంటున్నారు. అందుకే గుడ్లగూబల్ని పురాణాల్లో మేథస్సును పెంచే పక్షులుగా, తెలియని ప్రపంచానికి తీసుకెళ్లే మార్గదర్శినులుగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: