మనిషికి ఏదైనా పొందడంలో ఎంతో ఆనందం ఉంటుంది. దేన్నైనా సొంతం చేసుకుంటే ఎంతో ఆనందం పొందుతాం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే.. ఏదైనా పొందడంలో కంటే కోల్పోవడంలో కూడా ఆనందం ఉందని.. కోల్పోవడం అంటే పోగొట్టుకోవడం కాదు సుమా. మనస్ఫూర్తిగా మన వస్తువును ఇంకొకరికి ఇచ్చుకోవడం.

 

 

ఏదైనా అవసరంలో ఉన్నవారికి వారికి అవసరమైన దాన్ని దానం ఇవ్వడంలో గొప్ప ఆనందం ఉంటుంది. అందుకే వేమన దానమీనివాడు ధన్యుండుగాడయా అన్నాడు. దానం వల్ల పుణ్యం సిద్ధిస్తుందో... కీర్తి నిలుస్తుందనో.. దానం చేయడం కాదు.. దానం వల్ల మనం మానసికంగా ఆనందం పొందుతాం.

 

 

చరిత్రలో ఎందరో రాజులు పాలించారు. వారెవరూ సిరిమూటగట్టుకొని పోలేదు. గొప్పదాతలైన వారే యశఃకాయులయ్యారు. శిబి చక్రవర్తిని, బలి చక్రవర్తిని లోకం మరచిపోలేదు. కర్ణుడు అధర్మపక్షంలో ఉన్నా దానకర్ణుడుగా ప్రసిద్ధుడు. భూమికి పర్వతాలు, సముద్రాలు భారం కాదు. దాన గుణం లేనివారే భారమవుతున్నారు అంటాడు శ్రీనాథుడు.

 

 

సమాజసేవ కోసం, సత్కార్యాల కోసం మన దైనందిన సమయంలో కొంత కేటాయించడం ఉత్తమ సంస్కారం. దానం అన్ని కాలాల్లోనూ ఉత్తమమే. పూర్వులు వదిలివెళ్లిన ధనంతో కొంత భాగాన్ని వారి ఆత్మకల్యాణం కోసం దానం చెయ్యాలి. అదే నిజమైన అంజలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: