పితృదేవతలను స్మరించుకోవడం హిందూ సంప్రదాయం. వారి ఆత్మ శాంతి కోసం ప్రతి ఒక్కరూ కొన్ని కర్మలు ఆచరిస్తుంటారు. శ్రాద్ధం. జలతర్పణం, పిండదానం వంటివి చేస్తుంటారు. ఇవి చేయాల్సిందే. అదే సమయంలో పూర్వులు వదిలివెళ్లిన ధనంతో కొంత భాగాన్ని వారి ఆత్మ కల్యాణం కోసం దానం చెయ్యాలి. అదే నిజమైన అంజలి అవుతుంది.

 

 

పూర్వుల సంపదను వారి సద్గతుల కోసం సత్కర్మల కోసం దానం రూపంలో సమాజానికి ఇచ్చి వేయడంలోనే అసలైన అర్థం ఉంది. ఎవరైనా లోభమోహాలకు వశులై తమ సంపదను సదుపయోగం చేసి ఉండకపోతే ఆ లోపాన్ని వారి వారసులు పూరించాలి. దురాశతో, స్వార్థంతో కోట్ల ఆస్తుల్ని కూడబెట్టి వారసులకిస్తే వారు బాధ్యతారహితులు, సోమరులు, అహంకారులు అవుతారు.

 

 

మీకు పూర్వీకుల నుంచి సంపద లభిస్తే..దాన్ని ఈ కరోనా వేళ ఆకలితో అలమటించే నలుగురికి అన్నం పెట్టండి. ఇంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు. అలాగే మీ పితృదేవతలకు సైతం ఈ దాన కార్యాలు అత్యంత సంతృప్తి కలిగిస్తాయి.

 

 

ధనం కూడా తనను అనుభవించక, చేయదగిన దానాలు చెయ్యని వాణ్ని చూసి నవ్వుతుందట. దాన శీలిని మాత్రం లోభ మోహాలు దరిచేరవు. దానం గుప్తంగా ఉండాలి. ప్రచారం కోసం, కీర్తికోసం అయోగ్యులకు, అనుచిత కార్యాలకు దానం చెయ్యడాన్ని అర్థ దూషణమంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: