ఈ జీవితంలో చివరకు మిగిలేదేంటి.. ఈ ప్రశ్న అందరినీ ఎప్పుడో ఒకప్పుడు వేధిస్తూనే ఉంటుంది. ఇందుకు భక్తి మార్గంలో సంకేత పరమైన సమాధానం ఉంది. పరమ మంగళమైన శివస్వరూపాన్ని అనుసంథానం చేయాలనుకునేవారు ముందు విభూతి ధారణ చేస్తారు.

 

 

శివ భక్తులు విభూతిని ఐశ్వర్యంగా భావిస్తరాు. ఎందుకంటే.. అది అగ్నిలో కాలి శుద్ధమైన చిట్టచివరి సత్య వస్తువుగా మిగులుతుంది. వాస్తవానికి ఏ వస్తువుని కాల్చినా మిగిలేది బూడిదే, బూడిదని కాల్చినా మిగిలేది బూడిదే అదే. అందుకే.. ఆ వస్తువు యొక్క సత్స స్వరూపంగా చెబుతారు.

 

 

అలాంటి ఆ విభూతిని శివుడు ఒంటినిండా పూసుకుంటాడు. అంటే సృష్టి వ్యూహ రహస్యాన్ని అంతా విభూతి కణాలలో కూర్చి దానిని తన శరీరానికి పూసుకుని కాపాడతాడు. విభూతి సూచించే ఇంకో విషయం ఏంటంటే కాలంలో వచ్చినది కాలంలో కలిసిపోయి కాలానికతీతుడైన ఆ పరబ్రహ్మను పట్టుకుని ఆయనలో చేరిపోతుంది.

 

 

అందుకే ఎంతటి గొప్పవారయినా చివరకు శ్మశానంలో బూడిదగా మిగలాల్సిందే. చివరకు మిగిలేది ఇదే. అంటే ఈ చింతన నిరాశావాదం కాదు. వాస్తవాన్ని గుర్తించి మసలుకునేందుకు ఇది దోహదపడుతుంది. మనలో అహంకారం, కోపం, ఈర్ష్య వంటి గుణాలు ప్రకోపించినప్పుడు మనల్ని హెచ్చరిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: