ప్ర‌స్తుతం ఉండే బిజీ లైఫ్‌లో చాలా మంది క‌పుల్స్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి టైమ్ స్పెండ్ చెయ్య‌లేకపోతున్నారు. ఇటు ఇంట్లో అటు ఆఫీస్‌లో తీవ్ర‌మైన ఒత్తికి లోన‌యి శృంగార‌మ‌నేది మ‌న జీవితంలో ఒక‌టుంది అనేదే మ‌రిచిపోతున్నారు. ఇలాంటి ఒత్తిడి స‌మాయాల్లో ఒక మంచి ఔషధం లాగా శృంగారం ప‌ని చేస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. కొందరు వారానికి మూడు నాలుగు రోజులు చేస్తే.. కొందరు కొత్త జంటలు అయితే వారంలో ప్రతీరోజు అదేపని మీద ఉంటారు. అయితే కొంతమంది ఉద్యాగాలకు వెళ్లి, లేదా అలసట ఇలా కొన్ని కారణాలు వల్ల చాలా గ్యాప్ వస్తుంది. వారిలాంటి వాళ్ళకోసమే ఒక సర్వే ప్రత్యేకంగా శృంగారం చేసుకోడానికి మంచిరోజు అప్పుడు అని కనిపెట్టింది.

 

అమెరికాకు చెందిన లవ్ హానీ అనే సంస్థ శృంగారం ఏరోజుల్లో చేసుకుంటే మంచిదో అనే విషయం పైన  స‌ర్వేను చేసింది.  3వేల జంటలపై సర్వే నిర్వహించగా అందులో ఆసక్తికర సంఘటనలు ఎన్నో  బయటపడ్డాయి. ఒక్క శనిఆదివారల్లోనే 44 శాతం శృంగారం చేయడానికి ఇష్టపడతారట, ఎందుకంటే ప్ర‌తి రోజు ఉద్యోగ ఒత్తిడి ఇంట్లో ప‌నులు ఇలా వేరు వేరు చికాకుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. దీంతో మైండ్ శృంగారం వైపు మ‌ళ్ళ‌దు. అలా మ‌ళ్ళాలంటే చాలా క‌ష్టం. ఇందులో ఆదివారం 16, శుక్రవారం 23 శాతాలు చేస్తారట. ఇక శనివారం అయితే సాయంత్రం 7.30నిమిషాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చుపిస్తారట.

 

 మగవాళ్ళకి తెల్లవారుజామున ఎక్కువ కోరికలు ఉంటాయని ఈ సర్వేలో తేలింది. మరొక విషయం ఏమిటంటే మంగళవారం ఆ తరువాత గురువారం అంతగా ఇష్టపడరని కూడా తెలిసింది.  అలాగే మ‌రికొంద‌రు ఆధ్యాత్మికంగా సోమ‌వారం పూట కూడా చాలా మంది శృంగారం చేయ‌రంట‌. శివ భ‌క్తులు ఎవ్వ‌రూ కూడా దాదాపుగా చాలా మంది సోమ‌వారం శృంగారం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఆ రోజు మాత్రం మందు, మాంసం, మ‌గువ ముట్ట‌ర‌ని ఒక ఆచారంగా పెట్టుకుంటారు కొంద‌రు. ఇలా ర‌క ర‌కాల మ‌నుషులు వాళ్ళ మ‌న‌స్త‌త్వాలను బట్టి కొంద‌రు ప్ర‌వ‌ర్తిస్తుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: