మండే ఎండ‌లు స్టార్ట్ అయ్యాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్టోగ్రతలతో ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేస‌వి వ‌చ్చిందంటే చాలు..  ఉక్కపోత, చెమట, వేడి, దాహం ఇవే తెగ ఇబ్బంది పెట్టేస్తాయి. అందుకే చాలామంది మద్యం ప్రియులు సమ్మర్ వచ్చిందంటే చాలు.. చల్లటి బీరుతో గొంతు తడుపుకోవాలని జనాలంతా ఉత్సాహపడిపోతుంటారు. బీరులో నీటి శాతం ఎక్కువ, ఆల్కహాల్‌ శాతమేమో తక్కువ. కాబట్టి వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు బీరుని మించిన దారి లేదని చాలామంది అభిప్రాయం. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని నిపుణులు స్ప‌ష్టం చేశారు.

 

సాధార‌ణంగా బీర్ ఇత‌ర ఆల్క‌హాలిక్ డ్రింక్స్‌లాగే ఉంటుంది. కాక‌పోతే అందులో ఆల్కహాల్ శాతం త‌క్కువ‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలో చ‌ల్ల‌ని బీర్‌ను తాగితే అందులో ఉండే ఆల్క‌హాల్ వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంది. అంటే ఒంట్లో ఉన్న నీరు అంతా బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. అయితే స‌మ్మ‌ర్‌లో స‌హ‌జంగానే మ‌న శ‌ర‌రీంలో ఉండే నీరు డీహైడ్రేష‌న్ వ‌ల్ల బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. ఇక ఇలాంటి స‌మ‌యంలో బీర్ తాగ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. బీరులో ఉండే ఆల్కహాల్‌ వల్ల లివర్ దెబ్బతింటుందన్న విషయం తెలిసిందే. 

 

అయితే ఇందులో ఆల్కహాల్ శాతం తక్కువే అయినప్పటికీ.. గుండెజబ్బుల వంటి సమస్యలు ఉన్నవారికి ఇది తప్పకుండా చేటు చేస్తుందని చెబుతున్నారు. ఇక బీర్ మాత్రమే కాదు, ఏ ఇత‌ర ఆల్క‌హాలిక్ డ్రింక్ తాగినా స‌రే.. డీహైడ్రేష‌న్ మ‌రింత ఎక్కువవుతుంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. సమ్మర్ లో చల్లని బీరు తాగితే హ్యాపీగా ఉండొచ్చని, వడదెబ్బ బారిన పడకుండా ఉంటామనేది కేవలం అపోహ మాత్ర‌మే అని నిపుణులు తేల్చారు. చల్లని బీరు తాగితే చల్లగా ఉండే బదులు చివరకు ప్రాణం మీదకు వస్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఎండలో చల్లని బీరు మంచిదని బార్ షాపుల వాళ్లు చేసే ప్రచారం తప్పా, అందులో ఎటువంటి వాస్తవం లేదని స్ప‌ష్టం చేశారు. సో.. బీ కేర్‌ఫుల్‌..!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: