ఉల్లి చేసే మేలు, తల్లి కూడా చేయదంటారు. త‌ల్లి విష‌యం ప‌క్క‌న పెడితే.. ఉల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని శతాబ్దాలుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అతి తక్కువ ధరకు దొరికే వీటిని పేదల ఆహారంగా కూడా చెబుతారు. ఇక‌ మన ఇళ్లలో ఉల్లిపాయను వాడని వారు చాలా తక్కువగా ఉంటారు. శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది. కళ్లకు మంచి టానిక్‌లా పనిచేస్తుంది. కీళ్లకు, గుండెకు కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా, ఉల్లిగడ్డ ఆస్త్మా రాకుండా కూడా నివారించగలుగుతుంది.

 

అలాగే ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకొనే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. వాటిల్లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ‘సి’, బీటా కెరొటిన్ కూడా ఎక్కువ మొత్తంలోనే లభిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఉల్ల‌పాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఉల్లిపాయ శృంగార సామ‌ర్థ్యాన్ని కూడా పెంచుతుంద‌ట‌. సాధార‌ణంగా పురుషులు, మ‌రియు స్త్రీలు మాన‌సిక మ‌రియు శారీర‌క స‌మ‌స్య‌ల కార‌ణంగా శృంగారంలో భాగ‌స్వామిని సంతృప్తి ప‌ర‌చ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు.

 

ఈ క్ర‌మంలోనే సెక్స్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేయ‌లేక ఒత్తిడికి గుర‌వుతుంటారు. నిజానికి సెక్స్‌ వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. సెక్స్‌ వల్ల కొన్ని రకాల జబ్బులు మన దగ్గరకు కూడా రావు అని నిపుణులు అంటున్నారు. కానీ, ఆ సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయ‌లేక‌పోతే అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. అయితే  ఉల్లిపాయ‌ స‌హ‌జ‌సిద్ధంగా లైంగిక సామ‌ర్ధ్యాన్ని పెంచే మూలికగా పనిచేస్తుంది. ఉల్లిపాయ‌ను రోజువారి ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల‌న త‌గ్గిపోయిన లైంగిక శ‌క్తిని పెంచుకునే వీలుంది. మ‌రియు వెన్న‌లో వేయించిన ఉల్లిపాయ‌ను తిన‌డం ద్వారా సంభోగ శ‌క్తి పెరుగుతుంద‌ని అంటున్నారు. దీంతో శృంగార స‌మ‌యంలో ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చంటున్నారు.
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: