ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీనితో ప్రజలందరూ ఓ మోస్తరుగా ఇంట్లోనే ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కొందరు వారి పనులతో బిజీగా ఉంటే ఏ పని లేని వారు కేవలం టీవీతో, సెల్ ఫోన్ తో వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. రోజులో ఎక్కువ శాతం టీవీ చూడటం, లేదా సెల్ ఫోన్ లో స్నేహితులతో మాట్లాడడం, ఆడుకోవడం ఇలా చేస్తూ ఉన్నారు. 

 


అయితే బయటికి వెళ్లకుండా ఇది ఒక రకంగా మంచిదే కానీ, టీవీ ఎదుట కూర్చొని గంటల గంటల కొద్దీ అదేపనిగా ఉండి ఆ సమయంలో ఏదైనా స్నాక్స్ తింటుంటే మాత్రం కాస్త జాగ్రత్త... ఎందుకు ఇలా చెబుతున్నారు అంటే టీవీ చూస్తూ స్నాక్స్ తినడం వల్ల గుండె జబ్బులు,  డయాబెటిస్ కు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయట. ఇది ఏదో మిమ్మల్ని భయపెట్టాలని ఇలా చెబుతున్నారు అనుకుంటున్నారా కానేకాదు... సైంటిస్టులు కొంతమంది పై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని బహిర్గతం చేశారు.

 

బ్రెజిల్ దేశానికి చెందిన పలువురు నిపుణులు అక్కడ ఉండే యుక్త వయసులో వారిని దాదాపు 35 వేల మంది దాకా టీనేజర్ల ఆహార అలవాట్లను, వారికున్న వ్యాధులను వారి జీవన స్థాయిలో వివిధ కోణాల్లో వారిని పూర్తిగా స్టడీ చేసి ఈ సమాచారాన్ని వారు తెలిపారు. ఇందులో ముఖ్యంగా వారు తెలిపిన సంగతి ఏమిటంటే ప్రతి రోజూ ఆరు గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తూ ఉంటే అదే సమయంలో ఏవైనా స్నాక్స్ తినే వారిలో చాలామందికి మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నట్లు వారు గుర్తించారు. అయితే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉంటే ముఖ్యంగా డయాబెటిస్, గుండె కు సంబంధిత జబ్బులు త్వరగా వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి మీరు టీవీ చూస్తే చూడండి కానీ స్నాక్స్ తినే అలవాటు ఉన్నవారు మాత్రం వాటిని కాస్త మానుకోవాలని వారు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: