మ్యూజిక్‌.. అంటేనే మ్యాజిక్ అంటారు చాలా మంది. నేటి  కాలంలో ప్రతి ఒక్కరు స్ట్రెస్‌లో ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వ‌డానికి సాధారణంగా చేసే పనులలో మ్యూజిక్‌ వినడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. మ్యూజిక్‌ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని మార్చే మంత్రం. ఎంత బాధలో ఉన్నా సరే ఓ జోష్ ఫుల్ పాట వింటే మూడ్ ఇట్టే మారిపోతుంది.బాధను మర్చిపోవడానికైనా, ఆనందాన్ని ఆశ్వాదించడానికైనా, ప్రశాంతతను కోరుకోవడానికైన మ్యూజిక్‌ వినడం ఓ మంచి అల‌వాటు. ఒక‌వేళ మీకు మ్యూజిక్ వినే అల‌వాటు ఉంటే నిజంగా.. మీరు అదృష్ట‌వంతులు.

 

ఎందుకంటే.. మ్యూజిక్ విన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా మ్యూజిక్‌కీ మన బ్రెయిన్‌కీ లింక్ ఉంది. మనం చక్కటి మ్యూజిక్ వింటున్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం. అదే గంభీరమైన రెచ్చగొట్టే మ్యూజిక్ వింటే రెచ్చిపోతాం. కారణం మన బ్రెయిన్ ఆలోచనలు ఆ సాంగ్‌తో మిక్స్ అవుతాయి. అందువల్ల మనం మంచి సాంగ్స్, చక్కటి మ్యూజిక్ వ‌ల్ల‌.. మన టెన్షన్లను తగ్గిస్తుంది. మ‌రియు బ్రెయిన్‌లో కణాలను ఉత్తేజ పరుస్తుంద‌ని నిపుణులు అంటున్నారు. మ‌రో విచిత్ర విష‌యం ఏంటంటే.. సంగీతం నొప్పిని కూడా తగ్గిస్తుంద‌ట‌.

 

వివిధ రకాల సర్జరీలు చేయించుకున్నవారు సంగీతంతో ఉపశమనాన్ని పొందవచ్చట. అందుకే కొందరికి సర్జరీ సమయంలో, ఆ తర్వాత కూడా డాక్టర్లు మంచి సంగీతం వినమని చెబుతారు. ఎందుకంటే పెయిన్ కంట్రోల్‌కి సంగీతాన్ని మించిన ఔషధం లేదంటున్నారు నిపుణులు. అలాగే నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే.. పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. దీని వ‌ల్ల‌ హాయిగా నిద్రలోకి జారుకుంటార‌ట‌. ఇక వ్యాయామం చేసేటప్పుడు సంగీతం వింటే.. మనలో మరింత ఉత్సాహం పెరుగుతుంది. బరువు తగ్గాలని భావించే వారు సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఫ‌లితాలు త్వ‌ర‌గా పొందుతార‌ట‌. అలాగే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లు రోజు కాసేపు మ్యూజిక్ వినడం వల్ల త్వరగా కోలుకుంటారు.

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: