భార్యాభ‌ర్త‌లు అందులోనూ కొత్త‌గా పెళ్ళ‌యిన దంప‌తుల్లో శృంగారం మీద మొదట్లో ఉన్న ఆసక్తి పిల్లలు పుట్టిన తరువాత ఉండదని అంటారు కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్ పై ఆసక్తి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. పిల్లలు పుట్టాక సెక్స్ పై ఆసక్తి చూపకపోవడానికి నిపుణులు కొన్ని కారణాలు చెబుతున్నారు అవేంటో చూద్దాం...

 

పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత ఆడ‌వారికి కాస్త బాధ్య‌త ఎక్కువ‌గా పెరుగుతుంది. రోజంతా పిల్ల‌ల‌ను చూసుకునే స‌మ‌యంతో బాగా అలిసిపోతారు దాంతో దేని మీద పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ ఉండ‌దు. అల‌స‌ట వ‌ల్ల సెక్స్ మీద‌కు మ‌న‌సు వెళ్ళ‌దు. అందులోనూ ప్రధానంగా సిజేరియన్ వల్ల కలిగే భయం, కుట్లు వద్ద కలిగే నొప్పి, రక్తస్రావంతో రోగిలా పడి ఉండవలసి రావడం, కొత్తగా పుట్టిన పాప బాధ్యత, బేబీకి పాలు తాగించాల్సి రావడం, రాత్రిళ్లు పాపకు సంరక్షణ, ఆ నిర్వహణలో సరిగా నిద్ర పట్టక పోవడం, లేదా నిద్ర పోవడానికి సమయం లేకపోవడం, ప్రసవానంతరం హార్మోన్ల అసమతుల్యత వల్ల పోస్ట్ నాటల్ డిప్రెషన్ ఏర్పడటం, ఉద్రేకాలకు, ఆందోళనలకు లోను కావడం, చిరాకు, కోపం పెరగడం ఇవన్నీ కలిసి సెక్స్ పట్ల విముఖత కలిగించవచ్చని చెపుతున్నారు. 

 

దీనికితోడు.. మనసూ శరీరం రెండూ అలసి పోవడం అనే కారణం కూడా ఈ సెక్స్‌పట్ల విముఖతకు దారితీస్తుందని వైద్యులు చెపుతున్నారు. సో... మీరు మీ భాగస్వామి బాధలను అర్థం చేసుకొని లైంగిక జీవితాన్ని అనందించ‌డం చాలా మంచిది. దాని వ‌ల్ల ఇద్ద‌రికి ఇబ్బందులు క‌లుగ‌వు. ఎల్ల‌ప్పుడూ ఇద్ద‌రూ క‌ల‌సి మెలిసి ఉంటారు. అలా అర్ధం చేసుకోవ‌డంలో ఇద్ద‌రి జీవితం బావుంటుంది. ఇలా ఒక‌రినొక‌రు అర్ధం చేసుకుని న‌డిస్తే జీవిత‌మంతా కూడా సుఖ‌మ‌యం అవుతుంది. ఇక పిల్లలు కాస్త పెరిగిపెద్ద‌యితే మ‌ళ్ళీ సెక్స్ మీద ఇంట్ర‌స్ట్ అనేది చాలా స‌ర్వ‌సాధార‌ణం అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: