సాధార‌ణంగా మతం గొప్పదా.. మానవత్వం గొప్పదా అంటే మానవత్వమే గొప్పదంటాను. కులం గొప్పా.. మానవ కులం గొప్పా అంటే మానవ కులం గొప్పంటాను. మగవాడు గొప్ప.. ఆడవారు గొప్పా అంటే మనిషిని మనిషిగా చూసే ఎవరైనా గొప్పంటాను. వాస్త‌వానికి ఒకప్పుడు, ఆడవారు గొప్పా..  మగవారు గొప్పా అనే ప్రశ్న వస్తే..  ఓస్ ఇది తెలీదా మగవారే గొప్ప అనేవారు. కాదు ఆడవారు గొప్ప అంటే హేళన చేసేవారు. కానీ, ఈ సృష్టిలో అంద‌రూ ఒక‌టే. ఆడ‌, మ‌గ అని రెండు పేర్లు, రెండు దేహాలు ఉన్నా.. ఇద్ద‌రూ స‌మాన‌మే. ఈ ప్రకృతి ఆడవారికి కొన్ని వరాలు ప్రసాదిస్తే, మగవారికి మరికొన్ని ప్రసాదించింది.

 

అయితే కొన్ని విష‌యాల్లోనే మ‌గ‌వారిక‌న్నా ఆగ‌వారే ముందుంటార‌ట‌.  ఇదేదో ఆషామాషీగా చెబుతున్న విషయం కాదు. ఎన్నో అధ్యయనాలు చేశాకే ఈ నిర్ణ‌యానికి వ‌చ్చామంటున్నారు నిపుణులు. అందులో ముందుగా.. ఏదైనా సందర్భంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడిగా ఫీల్ అవుతారు. అయితే, ఒత్తిడిగా ఉన్న సమయంలోనూ మగవారు కంటే ఆడవారు చురుగ్గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఒకానొక సందర్భంలో ఆడవారు కాస్తా బలహీనంగా కనిపించి ఏడ్చినా.. ఆ తర్వాత వెంటనే ఒత్తిడి నుంచి తేరుకుని చురుగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోగల‌రంటున్నారు.

 

అలాగే ఆడవారికి మరో వరం ఈస్ట్రోజెన్. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కీ రోల్ పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టే ఆడవారు ఒత్తిడిని ఈజీగా తట్టుకోగలరని అంటున్నారు. అదేవిధంగా, ఇంటికి సంబంధించి మ‌గ‌వారి క‌న్నా ఆడవారే బెస్ట్ ఫైనాన్స్ మేనేజర్స్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వారికి ఓ బాధ్యతను అప్పగిస్తే అది పూర్తయ్యే వరకూ ఊరుకోరట. అందుకే మామూలు సమయాల్లో పెద్దగా పట్టించుకోకపోయినా ఆర్థిక నిర్వహణ మాత్రం బాగా చేయగలరని చెబుతున్నారు. ఇక ఆడవారు ఒకే సమయంలో ఎన్నో పనులను చక్కబెట్టగలరు. ఇందుకు ఉద్యోగిణులే ఆదర్శం.. ముఖ్యంగా గృహిణులు. ఇలాంటి వారు అటు ఇల్లు, ఇటు ఆఫీస్‌ని చక్కగా నిర్వహించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: