ఆధునిక యుగంలో మనిషికి తన గురించే ఆలోచించే తీరక ఉండటం లేదు. ఇక దేవుని గురించి ఆలోచించే సమయం ఎక్కడు ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో ఎన్ని మనిషికి ఆనందం అందించినా ఆధ్యాత్మిక అందించే తృప్తిని ఇవేవీ ఇవ్వలేవు. ఈ విషయాన్ని కూడా మనిషి కాస్త ఆలస్యంగానైనా తెలుసుకుంటాడు. దైవం గురించి అన్వేషణ ప్రారంభిస్తాడు.

 

 

కానీ అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు. ఆయన మనషులకు ఎలా కనిపిస్తాడు. అసలు దేవుడు ఎవరికీ చిక్కకపోతే, ఎవరి ఆలోచనలకీ అంతుపట్టకపోతే అలాంటి ఆయన కోసం ఎందుకీ తహతహ? వంటి ప్రశ్నలూ మొలకెత్తుతాయి. ఈ ప్రశ్నలకు మన పూర్వీకులు ఇప్పటికే సమాధానం చెప్పేశారు. మనిషికి దైవానుగ్రహం కావాలంటే.. చేయవలసింది మనసు ఆయనపై లగ్నం చేయడమే.

 

 

అది ఎలా అంటారా.. మన పలుకులు ఆయన గుణాలను వల్లెవేస్తూ ఉండాలి. మన చేతులు ఆయన మందిరాన్ని అలంకరించడంపట్ల అనురక్తి కలిగి ఉండాలి. మన చెవులు ఆయన కథాగాన శ్రవణాభిలాషతో తహతహలాడాలి. మన చూపులు ఆయన రూప వీక్షణాభిలాషతో ఉత్కంఠగా ఎదురుచూడాలి. మన శిరస్సు ఆ మూర్తికి కైమోడ్పులు చేస్తూ ఊగుతూ ఉండాలి.

 

 

మన పాదాలు ఆయన మందిరం వైపు దారి తీసేవిగా ఉండాలి. చివరకు మన మనసు ఆయనయందే లగ్నమై ఉండాలి. ఇవన్నీ చేసిన వ్యక్తికి ఆ భగవంతుడు తానే వెదుక్కుని వచ్చి మరీ వశమవుతాడట. ఈ విషయాన్నే మన మహాభాగవతం వివరిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: