నిజానికి దంపతులకు శృంగార జీవితాన్ని ఆనందంగా గడపాలని ఎవరికి ఉండదు చెప్పండి. అయితే అందరూ తమ జీవిత భాగస్వామితో ఆనందంగా, ఆహ్లాదంగా ఉండే సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అందరూ ఆలోచిస్తుంటారు. ఇక కొందరి దైనందిక జీవితంలో జరిగే పని ఒత్తిడి, తీసుకునే ఆహార అలవాట్లు, ఇలా అనేక రకాలైన కొన్ని విషయాలు వారి శృంగార జీవితం పై ప్రభావం చూపుతాయి. ప్రస్తుత రోజుల్లో వీటి బాధ ఎక్కువ ఉన్నందున వారి సుఖ సంసారాన్ని ఆనందంగా గడపలేక పోతున్నారు. ఇక మరికొందరికి అయితే పూర్తిగా సెక్స్ సామర్థ్యం తగ్గి పోయిందని చెప్పవచ్చు. ఇక ఇలాంటి విషయంలో కొన్ని చిన్న చిట్కాలు ఉపయోగిస్తే వాటికి చెక్ పెట్టవచ్చని అంటున్నారు నిపుణులు.

IHG

ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులను చేసుకోవడం, వ్యాయామం చేయడం లాంటివి, అలాగే పొగ తాగడం, మందు తాగడం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వంటివి చేయడం వల్ల ఇలాంటి విషయంలో వారి ఆరోగ్యం పురోగతి కనిపిస్తోంది అని ఇప్పుడు తిరుగుతున్నారు. ఇకపోతే ప్రతిరోజూ 60 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే వారి శృంగార జీవితానికి అది చాలా ఉపయోగ పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

IHG


అందులో ముఖ్యంగా వాల్ నట్స్ తీసుకుంటే వారి సెక్స్ సామర్థ్యం పెంచడంలో అవి చాలా కీలక పాత్ర పోషిస్తాయని వారు తెలియజేస్తున్నారు. వీటితోపాటు బాదం, జీడిపప్పు, ఆక్రోట్ మొదలగు డ్రై ఫ్రూట్స్ లను తీసుకుంటే చాలా మేలు చేస్తాయని తెలుపుతున్నారు. వీటిని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా క్రమం తప్పకుండా తింటే శరీర బరువు అదుపులో ఉండటమే కాకుండా మేధా శక్తి పెరగడం, ఉల్లాసంగా ఉంచేందుకు ఇది సహాయపడతాయని వారు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇవి వారి శృంగార జీవితానికి చాలా ఉపయోగపడతాయని ఒక పరిశోధనలో కూడా తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: