భారత దేశంలో దాదాపు ప్రతి ఒక్కరూ.. ఉదయం లేవగానే వెంటనే టీ తాగే అలవాటు ఉంది.  అలసటగా ఉండే సమయంలో ఉత్సాహాన్నిచ్చేది టీ. ఉదయం, సాయంత్రం టీ తాగనిదే మనసు కుదుట పడదు.  కొంత మంది మేథావులు టీ తాగితేనే తమ మనసు పలానా సబ్జెక్ట్ పై కేంద్రీకరించలమేం అంటుంటారు. ఇక సమావేశాలు మొదలు కావాలన్నా తేనీటీ విందు ముందుంటుంది. సరదాగా ఇద్దరు మిత్రులు కలిసినా... ఇంటికి ఎవరైనా వచ్చినా వారిని అడిగేది చాయ్‌ తాగమనే. సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు టీ అంటే ఎంతో ఇష్టపడతారు.  అందుకే  మృగరాజు చిత్రంలో మెగాస్టార్ ‘చాయ్‌ చటుక్కునా తాగరా భాయ్‌.. ’ అనే పాట స్వయంగా ఆయనే పాడి రంజింపజేశారు. 

 

నిజమే చాయ్‌ను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. చాయ్‌ ప్రాముఖ్యతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి మే 21ని అంతర్జాతీయ చాయ్‌ దినంగా ప్రకటించింది. ఈ రోజే తొలి చాయ్‌ దినం అయినందున.. చాయ్‌ ప్రియులందరికీ శుభాకాంక్షలు.  వేల సంవత్సరాల క్రితం చైనా దేశంలో పుట్టిన టీ ప్రపంచ మం తా మనుషుల మధ్య అనుబంధానికి, అను సంధానంగా మారింది. అంతటి పేరున్న చాయ్‌ మంచిదేనని నిపుణులు అంటున్నారు.

ఇక చాయ్ చరిత్ర విషయానికి వస్తే.. 

15వ శతాబ్దంలో చైనాలో ఒక వైద్యుడు ఆకులను తుంచి ఎండబెట్టి ఒక ప్రత్యేకత ఉష్ణోగ్రతకు వేడి చేసి వేడి నీటిలో నాన బెట్టగా వచ్చిన డికాషన్‌ను వైద్య పరీక్షలో సేవించాడు. డికాషన్‌ తాగడం వల్ల ఉత్తేజాన్ని పొందాడు. 17వ శతాబ్దంలోకి వచ్చే సరికి ఈస్ట్‌ ఇండియా కంపెనీ వినిమయ పద్ధతిలో బట్టలు, వెండికి, నల్ల మందుకు బదులుగా టీని చైనా నుంచి దిగుమతి చేసుకునేవారు. 1823లో బ్రిటన్‌కు చెందిన బ్రూస్‌ సోదరులు అస్సాంలో తేయాకులు కనిపెట్టినప్పుడు భారతదేశంలో టీ ఉత్పాదన మొదలైంది.  ప్రస్తుతం అస్సాం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ రాషా్ట్రల్లో ఎక్కువగా ఉండగా త్రిపుర, కర్ణాటక, మణిపూర్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లో కూడా తేయాకు తోటలు ఉన్నాయి.

 

ఇక టీ లో ఎన్నో రకాలు వచ్చాయి.  అల్లం, ఇలాచీ, మసాల, దమ్‌, ఇరానీచాయ్‌లతోపాటు చక్కని ఆరోగ్యం కోసం గ్రీన్‌ టీ, లెమన్‌ టీ, బ్లాక్‌ టీ, మెంతాల్‌, హెర్బల్‌ టీ ఇలా చాలానే అందుబాటులోకి వచ్చాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: