జీవితంలో కష్టాలు పడని వాడు ఎవడైనా ఉంటాడా.. ఉండనే ఉండడు. ప్రతి ఒక్కడికి వాడి స్థాయిలో ఇబ్బందులు, కష్టాలు, కడగండ్లు ఉంటూనే ఉంటాయి. కానీ ప్రతి ఒక్కడూ తనకు వచ్చిందే అసలైన కష్టం అనుకుంటాడు.. అక్కడే వస్తోంది చిక్కంతా. అంతే.. ఎవడి లైఫ్ వాడికి ఇంపార్టెంట్ కదా.

 

 

కానీ కష్టాలను కష్టాలుగా ఫీలైతేనే అసలైన కష్టం వస్తుంది. ఆ కష్టం మరింత పెరుగుతుంది. కష్టాలను మనం స్వీకరించే విధానంలోనే ఆ కష్టం ప్రభావం మనపై ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే.. మనం చెప్పే కష్టాలు కష్టాలు కాదు. ఈ జీవితాన్ని ఎదుర్కొనేందుకు మనం ఎంతవరకూ సిద్ధంగా ఉన్నాం అని చెక్ చేసేందుకు దేవుడు పెడుతున్న పరీక్షలు అనుకోవాలి.

 

 

అవును మరి.. జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. జీవితమే మనకొక పరీక్ష అని తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అసలు పరీక్షలు లేకపోతే ఫలితాలు ఎలా వస్తాయి? ఫలితాలు తెలియకపోతే మనపై మనకు అంచనాలు ఎలా వస్తాయి. అందుకే అసలు పరీక్షకు సిద్ధపడటంలోనే మనిషి గొప్పదనం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: