దోమలు.. చూడటానికి చిన్నగానే ఉన్నా.. ఇవే తెచ్చే తంటాలు అన్నీ ఇన్నీ కావు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా.. ఇలా దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వైరస్ లు చాలానే ఉన్నాయి. ఇక దోమల నివారణకు రోజూ ఇంట్లో వినియోగించే గుడ్‌నైట్లు, ఆల్‌అవుట్లు, మార్టిన్లు ఇలా రకారకాల పేర్లతో మార్కెట్లో లభించే దోమల నివారణ మందులు దీర్ఘకాలం వాడడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, మానసిక సమస్యలు త‌లెత్తుతాయిగాని.. దోమ‌లు మాత్రం పోవు. వాస్త‌వానికి దోమ కాటు మనిషి ప్రాణాన్ని ప్రమాదంలోకి నెడుతుంది. అందుకే జబ్బు వచ్చిన తర్వాత తీసుకొనే జాగ్రత్తలు కంటే జబ్బు రాకుండా తీసుకొనే ముందు జాగ్రత్తలు ఎంతో విలువైనవి అంటున్నారు. 

 

అయితే దొమ‌లు కొంద‌రిని మాత్రం ఎక్కువ‌గా కుడ‌తాయ‌ట‌. మ‌రి దోమలు ఎవర్ని ఎక్కువగా కుడతాయో తెలుసుకుని... అలాంటి వ్యక్తుల లిస్ట్ నుంచీ మనం బయటపడితే బెట‌ర్ అంటున్నారు నిపుణులు. దోమలు మనం విడిచిపెట్టే కార్బన్ డై ఆక్సైడ్ కు ఆకర్షితమవుతాయట. లావుగా, అధిక బరువు ఉన్నవారు ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ విడుస్తారు. అందువల్ల అలాంటి వారి దగ్గరకు ఎక్కువ దోమలు వెళ్తాయి. మ‌రియు ప్రెగ్నెన్సీ మహిళలు కూడా ఎక్కువగా కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తారు. అందువల్ల అలాంటి వాళ్లను దోమలు టార్గెట్ చేస్తాయి.

 

అదేవిధంగా, ఓ బ్లడ్ గ్రూప్ ఉండే వాళ్ల‌పై దోమ‌లు ఎక్కువ‌గా చేస్తాయి. అదే... ఏ, బీ గ్రూప్ వారిపై ఓ మోతాదు సంఖ్యలో దాడి చేస్తాయి. అలాగని ఓ గ్రూప్ వారు నిరాశ పడాల్సిన పనిలేదు. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే.. వాటి దాడి నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే దోమ‌ల‌కు నైట్ టైమ్‌ క‌ళ్లు బాగా క‌నిపిస్తాయి. ఇక ఎప్పుడైతే ఇంట్లోకి దోమ‌లు చొర‌బ‌డ‌తాయో.. డార్క్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నవాళ్లకు ఎట్రాక్ట్ అవుతాయి. నేవీ బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ వంటి డ్రెస్ వేసుకున్నవాళ్ల దగ్గరకు ముందుగా వెళ్తాయి. ఎందుకంటే ఆ డ్రెస్సులు వేసుకున్న వాళ్లు దోమలకు వెంటనే కనిపిస్తారు. దాడి మొదలుపెడతాయి. సో... నైట్ మనం లైట్ కలర్ డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: