రోజూ ఎందరితోనూ కలసి పని చేస్తుంటాం. కానీ కొందరి వల్ల మనం అనుకోకుండా నష్టపోతాం.. కనీసం అలా నష్టపోతున్నామని మనం గుర్తించేలోపే జరిగే నష్టం జరిగి తీరుతుంది. మనిషి సంఘజీవి. మన విజయం, పరాజయం మనపై కంటే... ఎక్కువగా ఇతరులపై ఆధారపడే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మనం మన చుట్టూ ఉండేవారిని ఓ సారి గమనించాలి.

 

 

 

ఎలాంటి వాళ్లతో కలసి పనిచేస్తున్నామన్న విషయంలో క్లారిటీ ఉండాలి. మన చుట్టూ ఉన్న వ్యతిరేక దృక్పథం ఉన్నవాళ్లు మన విజయాలపై ప్రభావం చూపుతారు. కొందరు పనిదొంగలు ఉంటారు. వీరు ఏ మాత్రం అనుకున్న సమయనికి లేదా వస్తామన్న సమయానికి ఎప్పుడూ రారు.పని చేయాల్సివస్తే ఇలా కనబడి అలా మాయమైపోతారు. పనిపూర్తయ్యాక తప్పనిసరిగా కనబడతారు.

 

 

అందుకే.. వీరిని నమ్ముకొని ఏ పని మొదలెట్టినా పనంతా మనం చేసుకోవలసి వస్తుంది లేదా అనుకున్న పని వీరి మూలంగా వాయిదా పడే పరిస్థితి తలెత్తుతుంది. ఇంకొందరు పుకారుగాళ్ళు ఉంటారు. వీరికి లేనిపోని, పనికిమాలిన అనవసర కబుర్లతో కాలక్షేపం చేయడమంటే వీరికి చాలా ఇష్టం.

 

 

నిత్యం ఎవరిగురించో గాలికబుర్లు ప్రచారం చేస్తుంటారు. ఎవరినైనా ఎత్తెయ్యాలన్నా, ముంచెయ్యాలన్నా వీరికి క్షణంలో పని. అందుకే మన చుట్టూ ఉన్న వాళ్లను జాగ్రత్తగా గమనించాలి. మన విజయానికి తోడ్పడే వాళ్లతోనే పని చేయాలి. అదే మన విజయానికి దారి తీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: